- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం : మున్సిపల్ చైర్మన్
ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

దిశ, హుజుర్ నగర్ టౌన్ : ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని హుజూర్నగర్ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శుక్రవారం హుజూర్నగర్ పట్టణంలోని గోవిందాపురంలో ప్రజాపాలన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర భారీ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సహకారంతో హుజూర్ నగర్ పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. స్మశాన వాటిక పనులు చేపడతామని, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల పునర్నిర్మాణానికి కృషి చేస్తామని తెలిపారు. గోవిందపురం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కమ్యూనిటీ హాల్లో ఫ్యాన్లను ఏర్పాటు చేసేందుకు వెంటనే నిధులు మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
కమ్యూనిటీ హాలుకు వెంటనే విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోవిందపురంలో అభివృద్ధి పనులకు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, చైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు, కమిషనర్ సతీష్ కుమార్ సహాయ సహకారాలు అందించాలని ఈ సందర్భంగా 8 వార్డు కౌన్సిలర్ కోలా ఉదయభాను కోరారు. ఎస్సీ కమ్యూనిటీ హాలు నిర్మాణానికి 30 లక్షలు, ప్రభుత్వ పాఠశాల పనులకు అదనంగా మరో 20 లక్షలు నిధులు మంజూరు చేయాలని ఆమె కోరారు. స్మశాన వాటిక అభివృద్ధికి 40 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున రావు, కమిషనర్ సతీష్ కుమార్, ఏఈ వినోదు, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, విద్యుత్ ఎ.రాంప్రసాద్, ఆయుష్షు డాక్టర్ చందన్ కుమార్, ఇందిరాల రామకృష్ణ, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ రాజశేఖర్, వివిధ పార్టీల నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.






