సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల

by Muthe.Rajitha |

రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ విడుదల చేసింది.

సివిల్ అసిస్టెంట్ సర్జన్ల ప్రొవిజనల్ మెరిట్ జాబితా విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియలో భాగంగా అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్ స్పెషలిస్ట్ పోస్టుల కోసం ప్రొవిజనల్ మెరిట్ జాబితాను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డ్ (ఎంహెచ్ఎస్ఆర్బీ) విడుదల చేసింది. ఎంపిక ప్రక్రియలో భాగంగా 1:1.5 నిష్పత్తిలో అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేసి వారి జాబితాను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. షార్ట్‌లిస్ట్ అయిన అభ్యర్థులకు ఈ నెల 12, 13 తేదీల్లో (గురు, శుక్రవారాల్లో) సర్టిఫికెట్ల పరిశీలన నిర్వహించనున్నారు. హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్ ప్రాంతంలో ఉన్న హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఇనిస్టిట్యూట్ లో ఈ వెరిఫికేషన్ ప్రక్రియ జరుగుతుంది.

అభ్యర్థులు తమ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు రెండు సెట్ల జిరాక్స్ కాపీలను తప్పనిసరిగా వెంట తీసుకురావాలని అధికారులు సూచించారు. నిర్ణీత తేదీల్లో హాజరుకాలేకపోయిన వారు లేదా ఏవైనా పత్రాలు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థులకు మార్చి 16న రిజర్వ్ డేగా అవకాశం కల్పించినట్లు వెల్లడించారు. మెరిట్ జాబితా, వెరిఫికేషన్‌కు ఎంపికైన అభ్యర్థుల వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చూడవచ్చని అధికారులు తెలిపారు.

Next Story