శరద్ పవార్ ఇంటి ముందు ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన

by Disha Web Desk 17 |
శరద్ పవార్ ఇంటి ముందు ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
X

ముంబై: మహారాష్ట్ర సీనియర్ రాజకీయ నేత శరద్ పవార్, ఆయన కూతురు ఎంపీ సుప్రియో సూలే ఇంటి ముందు పెద్ద ఎత్తున ఆందోళనకారులు నిరసనకు దిగారు. దాదాపు 100 మందికి పైగా దక్షిణ ముంబైలోని శరద్ పవార్ ఇంటి ముందు ఆయనకు వ్యతిరేక నినాదాలు చేస్తూ, మహరాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (ఎంఎస్ఆర్టీసీ) ని పూర్తి ప్రభుత్వ విభాగంగా మార్చాలని డిమాండ్ చేశారు. గత కొన్ని నెలలుగా వేల సంఖ్యలో ఆర్టీసీ వర్కర్లు తమకు ప్రభుత్వ ఉద్యోగాలుగా పరిగణించాలని కోరుతున్నారు. అంతేకాకుండా ప్రభుత్వంలో విలీనం చేయాలని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులు విధులను బహిష్కరించడంతో, ఈ విషయం హైకోర్టు వరకు వెళ్లింది. ఈ నెల 22లోగా అందరూ విధుల్లో హాజరు కావాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 'ఉద్యోగుల నిరసనల్లో ఇప్పటివరకు 120 వరకు ఆత్మహత్య చేసుకుని మరణించారు. ఇవి రాష్ట్ర ప్రభుత్వం చేసిన హత్యలే. ఆర్టీసీని మేము ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ఈ విషయంలో ఎలాంటి పరిష్కారం చూపలేదు' అని నిరసన తెలుపుతున్న ఉద్యోగి అన్నారు. కాగా, మూడు పార్టీల కలయికగా ఉన్న మహా వికాస్ అగాధీకి ప్రధాన వ్యూహకర్తగా పవార్ ఉన్నారు.


Next Story

Most Viewed