ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వరం పరిష్కారం : కలెక్టర్ దీపక్ తివారి

by Batti.Sumithra |

ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సరైన న్యాయం చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు.

ప్రజావాణికి వచ్చే సమస్యలకు సత్వరం పరిష్కారం : కలెక్టర్ దీపక్ తివారి
X

దిశ, వికారాబాద్ ప్రతినిధి : ప్రజావాణికి వచ్చే సమస్యలను సత్వరం పరిష్కరించి, ఫిర్యాదుదారులకు సరైన న్యాయం చేయడం జరుగుతుందని వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. సోమవారం వికారాబాద్ జిల్లా కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి వివిధ సమస్యలపై ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణికి 104 ఫిర్యాదులు రావడం జరిగిందన్నారు. ప్రాధాన్యత క్రమంలో అధికారులు శాఖల వారీగా సమస్యలను పరిష్కరించి, ఫిర్యాదుదారులకు న్యాయం చేయాలన్నారు. ముఖ్యంగా రైతుల భూ సమస్యల పరిష్కారానికి అధికారులు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు. ప్రజల సమస్యలపై నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని కలెక్టర్ అధికారులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఉమాశంకర్ ప్రసాద్, వెంకట చారి, జిల్లా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Next Story