స్టాక్ మార్కెట్‌లో లాభాల విందు.. సెన్సెక్స్ 1200, నిఫ్టీ 380 పాయింట్ల జంప్

by Malleboina Mahesh |

స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలు! అమెరికా-ఇరాన్ చర్చల నేపథ్యంలో సెన్సెక్స్ 1200, నిఫ్టీ 380 పాయింట్ల జంప్. ఇన్వెస్టర్లలో పెరిగిన నమ్మకం.

స్టాక్ మార్కెట్‌లో లాభాల విందు.. సెన్సెక్స్ 1200, నిఫ్టీ 380 పాయింట్ల జంప్
X

దిశ, వెబ్ డెస్క్: అంతర్జాతీయ పరిణామాలు భారతీయ స్టాక్ మార్కెట్‌ (Indian stock market)కు సరికొత్త ఊపునిచ్చాయి. అమెరికా, ఇరాన్ దేశాలు యుద్ధం ముగింపు కోసం మరోసారి చర్చల వేదికపైకి రానున్నాయన్న వార్తలతో గ్లోబల్ మార్కెట్‌లలో పాజిటివ్ సెంటిమెంట్ పెరిగింది. దీంతో భారతీయ సూచీలు నేడు భారీ గ్యాప్-అప్ ఓపెనింగ్‌ను నమోదు చేశాయి. సెన్సెక్స్ (SENSEX) ప్రారంభ ట్రేడింగ్‌లోనే 1200 పాయింట్లకు పైగా లాభపడి 78,139 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ (NIFTY) 380 పాయింట్ల వృద్ధితో 24,235 స్థాయిని చేరుకుంది. బ్యాంకింగ్, ఐటీ, ఆటో, మెటల్, ఫార్మా వంటి అన్ని రంగాలు లాభాల్లో దూసుకెళ్తున్నాయి. ముఖ్యంగా రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు మార్కెట్‌ను ముందుకు నడిపిస్తున్నాయి.

లాభాలకు ప్రధాన కారణాలు..

అమెరికా-ఇరాన్ మధ్య చర్చల ప్రక్రియ మళ్లీ మొదలవుతుండటంతో హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తతలు తగ్గుతాయని, తద్వారా చమురు సరఫరా మెరుగుపడుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. యుద్ధం ముగుస్తుందన్న సంకేతాలతో ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లు మళ్ళీ రిస్క్ తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు. దేశీయంగా మహిళా రిజర్వేషన్ బిల్లు, డీలిమిటేషన్ బిల్లులపై ప్రభుత్వం తీసుకుంటున్న చొరవ కూడా రాజకీయ స్థిరత్వాన్ని సూచిస్తూ మార్కెట్‌కు అదనపు బలాన్ని ఇచ్చినట్లు విశ్లేషకులు బావిస్తున్నారు.

Next Story