కాంగ్రెస్‌ సర్కార్‌పై చాలా వ్యతిరేకత ఉంది.. బాంబ్ పేల్చిన కోదండరాం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్‌ సర్కార్‌పై చాలా వ్యతిరేకత ఉంది.. బాంబ్ పేల్చిన కోదండరాం
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ జనసమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. మా అభిప్రాయాన్ని కాంగ్రెస్‌కు స్పష్టంగా చెప్పామని తెలిపారు. సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క తెలంగాణ బిడ్డపై ఉందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణిని కార్పొరేట్ శక్తుల చేతిలో బంధీ కానీయొద్దని తెలిపారు. నేను కూడా ఫోన్ ట్యాపింగ్ కేసు బాధితుడినే అన్నారు. అక్రమంగా ఫోన్ ట్యాపింగ్ చేసేటప్పుడు లేని భయం.. విచారణ సమయంలో మొదలైందని బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. బీఆర్ఎస్ నేతలు చేయని అవినీతి లేదని విమర్శించారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ కుటుంబం తప్పా ఎవరూ బాగుపడలేదని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో తెలంగాణ జన సమితి కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని కోదండరాం పిలుపునిచ్చారు.

Next Story