పోస్టర్లలోనే వందల కోట్లు.. వచ్చేది రూ.40 కోట్లు కూడా ఉండదు: నిర్మాత

by Gantepaka Srikanth |

మూవీ కలెక్షన్లపై నిర్మాత అనిల్ సుంకర షాకింగ్ కామెంట్స్ చేశారు. మూవీ కలెక్షన్స్‌లో గ్రాస్‌కి, షేర్‌కి తేడా తెలియనివాళ్లు చాలామంది ఉన్నారు.

పోస్టర్లలోనే వందల కోట్లు.. వచ్చేది రూ.40 కోట్లు కూడా ఉండదు: నిర్మాత
X

దిశ, వెబ్‌డెస్క్: మూవీ కలెక్షన్లపై నిర్మాత అనిల్ సుంకర(Anil Sunkara) షాకింగ్ కామెంట్స్ చేశారు. మూవీ కలెక్షన్స్‌లో గ్రాస్‌కి, షేర్‌కి తేడా తెలియనివాళ్లు చాలామంది ఉన్నారు. అందుకే నేను పోస్టర్లు రిలీజ్ చేయడం ఆపేశాను. దానిని ఓ పబ్లిసిటీ స్టంట్ కింద చూసేవాళ్లం. ఒక సినిమాకి రూ.100 కోట్ల గ్రాస్ అని పోస్టరేస్తే దాంట్లో వచ్చేది రూ.40 కోట్లే. కానీ రూ.100 కోట్లు వచ్చేశాయా అని అట్రాక్ట్ అవుతారు అని తెలిపారు. గత రెండేళ్లుగా ప్రేక్షకులు నాపై చూపిన ప్రేమకు బాధ్యతగా నేనిచ్చే సమాధానమే ఈ సినిమా అని అన్నారు. ఇందులో శ్రీవిష్ణు అతిథి పాత్రలో కనిపిస్తారు. అనిల్ సుంకర నిర్మించిన నారీ నారీ నడుమ మురారి చిత్రం(Nari Nari Naduma Murari Movie) ఈనెల 14వ తేదీన విడుదల కాబోతోంది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత ఇచ్చిన ఇంటర్వ్యూలో కలెక్షన్లపై మాట్లాడారు. శర్వానంద్‌ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని రామ్‌ అబ్బరాజు తెరకెక్కించారు. సంయుక్తా మేనన్, సాక్షి వైద్య కథానాయికలు. నరేశ్‌ కీలక పాత్ర పోషించారు.

Next Story