కోరికలు తీర్చకపోతే అవకాశాలు రావు.. ఇది వందశాతం నిజం: కాస్టింగ్ కౌచ్‌పై బాంబ్ పేల్చిన ప్రొడ్యూసర్

by Gantepaka Srikanth |   (  Updated:2026-01-30 10:20:51  IST  )

కాస్టింగ్ కౌచ్ వ్యవహారం మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

కోరికలు తీర్చకపోతే అవకాశాలు రావు.. ఇది వందశాతం నిజం: కాస్టింగ్ కౌచ్‌పై బాంబ్ పేల్చిన ప్రొడ్యూసర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాస్టింగ్ కౌచ్(Casting Couch) వ్యవహారం మరోసారి ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ‘మన శంకర వరప్రసాద్’ సినిమా సక్సెస్ మీట్‌లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపాయి. సినిమా ఇండస్ట్రీని ఒక ‘అద్దం’తో పోలుస్తూ, మన ప్రవర్తన ఎలా ఉంటే అదే తిరిగి మనకు వస్తుందని అన్నారు. అవకాశాల కోసం తప్పు దారులు తొక్కాల్సిన అవసరం లేదని, నిబద్ధతతో, ప్రొఫెషనల్‌గా ఉంటే సినీ రంగంలో ఎదగవచ్చని చిరంజీవి మాట్లాడారు. ఈ కామెంట్స్‌తో సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. చిరంజీవి వ్యాఖ్యలపై సింగర్ చిన్మయి(Chinmayi Sripada) స్పందిస్తూ.. చిరంజీవి చెప్పిన మాటలు వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఉన్నాయన్నారు. ఇండస్ట్రీలో “కమిట్‌మెంట్” అనే పదానికి వృత్తిపరమైన అర్థం మాత్రమే లేదని, చాలా సందర్భాల్లో అది లైంగిక ఒత్తిడిని సూచిస్తోందని ఆమె ఆరోపించారు. మహిళలు శరీరాన్ని అప్పగించకపోతే అవకాశాలు రావని అనేక సందర్భాల్లో తాను చూశానని, విన్నానని చిన్మయి సోషల్ మీడియాలో వెల్లడించారు. చిరంజీవి తొలి రోజుల్లో పరిస్థితి ఎలా ఉండేదో తమకు తెలియదు కానీ.. ఇప్పుడు పరిస్థితులు మొత్తం మారిపోయాయని ఆమె అన్నారు.

పరిస్థితులు దిగజారాయి

తాజాగా ఈ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadwaja) స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేశారు. ఇండస్ట్రీలో వేధింపులు లేవని ఎవరూ చెప్పలేరని, అవి వందశాతం ఉన్నాయని ఆయన కుండబద్దలు కొట్టారు. ఒకప్పుడు రాజులు, జమీందారులు మహిళల కోసమే సినిమాలు తీసేవారని, కాలక్రమేణా పరిస్థితులు దిగజారాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ(Telugu Film Industry) ప్రారంభం నుంచే ఈ సమస్య ఉందని, ఏడాదికి దాదాపు 250 సినిమాలు నిర్మితమవుతుంటే, అందులో 30 నుంచి 40 సినిమాలు మాత్రమే మహిళలను ఇలా వాడుకునే ధోరణితో రూపొందుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. క్యాస్టింగ్ కౌచ్ గురించి చిన్మయి చెప్పింది నిజమేనని, లైంగిక వాంఛలు తీర్చుకోవాలనే ధోరణి పరిశ్రమలో ఒకరిద్దరు పెద్దల్లో ఉందని తమ్మారెడ్డి భరద్వాజ పేర్కొన్నారు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి.

Next Story