- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘రాజా సాబ్’ వరుస అప్డేట్స్ అప్పటి నుంచి వస్తాయి.. నిర్మాత కామెంట్స్ వైరల్
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి (Maruti)కాంబోలో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’(Raja Saab). దీనిని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో నిధి అగర్వాల్(Nidhi Agarwal), రిద్ధి కుమార్, మాళవిక మోహనన్(Malavika Mohanan) హీరోయిన్లుగా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి పోస్టర్, గ్లింప్స్ తప్ప మరే అప్డేట్ రాలేదు. దీంతో ప్రభాస్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా రాజాసాబ్(Raja Saab) అప్‌డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. అయితే అక్టోబర్ 23న ప్రభాస్ (Prabhas) బర్త్ డే నాడు అయినా టీజర్, లేదా ట్రైలర్ విడుదల అవుతుందేమోనని వెయిట్ చేస్తున్నారు.
ఈ క్రమంలో.. నిర్మాత ఎస్‌కేఎన్ రాజాసాబ్ (Raja Saab)మూవీ అప్డేట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘అక్టోబర్ 23న రాజా సాబ్ అప్డేట్స్ ప్రారంభమవుతాయి. ఆ తర్వాత వరుసగా వస్తూనే ఉంటాయి. దీని కోసం మారుతి(Maruti), విశ్వప్రసాద్ ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తారు. అక్టోబర్ 23న విడుదల అయ్యే వరకు ప్రేక్షకులను రాజాసాబ్(Raja Saab) ప్రపంచంలోకి తీసుకెళ్తాం. మీడియా వాళ్లకు కూడా ఈ ప్రపంచాన్ని చూపించాలనుకుంటున్నారు. రాజా సాబ్ కోసం మారుతి(Maruti) ఒక్కరోజు కూడా సమయం వృథా చేయకుండా షూటింగ్ చేస్తున్నారు. కనీసం పండుగలకు కూడా సెలవు తీసుకోకుండా కష్టపడుతున్నారు. అనుకున్న సమయానికే మూవీ విడుదల చేయాలని పట్టుదలతో ఉన్నారు’’ అని చెప్పుకొచ్చారు.