- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రహ్లాద్ జోషిపై ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు.. బీజేపీ ఆగ్రహం
by Muthe.Rajitha |
నేడు పార్లమెంటులో ఎంపీ ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు.

X
దిశ, వెబ్ డెస్క్ : నేడు పార్లమెంటులో ఎంపీ ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేసారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిపై చేసిన ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. కాగా మంగళవారం పార్లమెంటులో యాంటీ పేపర్ లీక్ బిల్లుపై చర్చిస్తుండగా.. కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంక గాంధీ.. "ఒక గర్భిణీపై అత్యాచారం చేసి, యధేచ్చగా బయటకు వచ్చిన వారిని మెచ్చుకున్న నాయకుడిని తెచ్చి విద్యాశాఖ మంత్రి పదవి ఎలా ఇస్తారని.. ప్రహ్లాద్ జోషిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసారు. దీంతో సభలోని బీజేపీ నేతలు ఆధారాలు లేకుండా మాట్లాడవద్దని మండిపడ్డారు. తక్షణమే ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు. కాగా తన వ్యాఖ్యలపై వెనక్కి తగ్గేది లేదని ప్రియాంక మరోసారి పునరుద్ఘాటించారు. ఈ వ్యవహారంపై సభలో కాసేపు గందరగోళం నెలకొంది.
Next Story






