ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ఖైదీ పరారీ

by Vinod kumar |

దిశ, అదిలాబాద్: జిల్లా జైల్లో శిక్షను అనుభవిస్తున్న - Prisoner escapes from Adilabad district jail

ఆదిలాబాద్ జిల్లా జైలు నుంచి ఖైదీ పరారీ
X

దిశ, అదిలాబాద్: జిల్లా జైల్లో శిక్షను అనుభవిస్తున్న ఖైదీ అధికారుల కన్నుగప్పి పరారైన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా జరి మండలం పార్సోడి గ్రామానికి చెందిన నాగోరావు 2016లో తంసి పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఖైదీ నాగోరావుకు కోర్టు పదేళ్ల జైలు శిక్ష, 5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. అప్పటి నుంచి జిల్లా జైల్లో శిక్షను అనుభవిస్తున్న (అవుట్ గ్యాంగ్) ఖైదీ గురువారం మధ్యాహ్నం అధికారుల పర్యవేక్షణలో జైలు ఆవరణలో పిచ్చి మొక్కల తొలగింపు.. వివిధ పనులు చేస్తూ అధికారుల కన్నుగప్పి పరారయ్యాడు. ఈ విషయమై ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జైలు అధికారులు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో శుక్రవారం ఫిర్యాదు చేశారు. పరారైన ఖైదీనీ పట్టుకోవడానికి పోలీసులు జైలు సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు.

Next Story