- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'థ్యాంక్ యూ మెలోని..' ప్రధాని మోడీ స్పెషల్ వీడియో
భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల పాటు చేపట్టిన అధికారిక విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది.

దిశ, వెబ్ డెస్క్ : భారత ప్రధాని నరేంద్ర మోడీ ఐదు రోజుల పాటు చేపట్టిన అధికారిక విదేశీ పర్యటన విజయవంతంగా ముగిసింది. మోడీ విదేశీ పర్యటనకు సంబంధించిన చారిత్రక ఘట్టాలు, వివిధ దేశాల నేతలతో భేటీల ముఖ్యాంశాలతో కూడిన ఒక స్పెషల్ వీడియోన సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. ఈ పర్యటనలో చివరగా మోడీ ఇటలీ రాజధాని రోమ్ నగరానికి చేరుకున్నారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని, ఉన్నతాధికారులు చారిత్రక కొలీసియం ఆంపి థియేటర్ వద్ద అత్యంత ఆత్మీయంగా ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరు దేశాల ప్రధానులు ప్రత్యేక సమావేశం అయ్యారు.
ఇక తన ఇటలీ పర్యటన సక్సెస్ ఫుల్ గా పూర్తయిందని ప్రధాని నరేంద్ర మోడీ తన అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతా వేదికగా ప్రత్యేకంగా ట్వీట్ చేశారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో జరిగిన అధికారిక భేటీలో రక్షణ, సాంకేతికత, వాణిజ్యం, ఇండియా - మిడిల్ ఈస్ట్ - యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) వంటి వివిధ కీలక రంగాలపై విస్తృతంగా చర్చించామని ఆయన పేర్కొన్నారు. ఇండియా-ఇటలీ దేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేసి, దానిని మరో సరికొత్త ఎత్తుకు తీసుకువెళ్లడమే ఈ ఐదు రోజుల పర్యటన యొక్క ముఖ్య ఉద్దేశమని ఆయన వివరించారు. ఈ చర్చలు భవిష్యత్తులో ఇరు దేశాల ఆర్థిక ప్రగతికి మరియు పరస్పర సహకారానికి ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేస్తూ, తనకు లభించిన అద్భుత ఆతిథ్యానికి గానూ పీఎం మెలోనికి, ఇటలీ ప్రజల స్నేహానికి ప్రధాని మోడీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.






