- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోడీ పేరు ప్రస్తావన.. అసలు నిజాలు ఏమిటి?
గత కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా సంచలనంగా మారుతున్న ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఉండటం సంచలనంగా మారింది.

దిశ, వెబ్‌డెస్క్: గత కొద్దిరోజులుగా అంతర్జాతీయంగా సంచలనంగా మారుతున్న ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు ఉండటం సంచలనంగా మారింది. దీనిపై ప్రతిపక్షాలతో పాటు పలువురు సోషల్ మీడియా వేదికగా చర్చకు దారీ తీశారు. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన వివాదాస్పద వ్యాపారవేత్త, నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) మరణం తర్వాత అతనికి సంబంధించిన సుమారు 3.5 మిలియన్ల పేజీల దర్యాప్తు పత్రాలను అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ జనవరి 30న విడుదల చేసింది. ఈ డాక్యుమెంట్లలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది ప్రముఖుల పేర్లు బయటపడ్డాయి. అందులో భారత ప్రధాని నరేంద్ర మోడీ పేరు కూడా ప్రస్తావనకు రావడంతో భారత్‌లో రాజకీయ దుమారం రేగింది.
ఇంతకీ ఆ ఫైల్స్‌లో ఏముంది
ఎప్‌స్టీన్ రాసినట్లుగా భావిస్తున్న కొన్ని ఈమెయిల్స్‌లో ప్రధాని ప్రధాని నరేంద్ర మోడీ పేరు కనిపించింది. 2017లో ప్రధాని మోడీ ఇజ్రాయెల్ సందర్శించిన అంశాన్ని ఎప్‌స్టీన్ ఒక ఈమెయిల్‌లో ప్రస్తావించాడు. ప్రధాని మోడీ తన సలహా మేరకే, అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రయోజనాల కోసం ఆ పర్యటన చేశారని, అది విజయవంతమైందని (It worked!) ఎప్‌స్టీన్ పేర్కొన్నట్లు తెలుస్తుంది. 2014 నుంచి 2019 మధ్య కాలంలో భారత ప్రభుత్వంలోని కీలక వ్యక్తులతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి, అలాగే రిపబ్లికన్ స్ట్రాటజిస్ట్ స్టీవ్ బానన్‌తో మోడీకి సమావేశం ఏర్పాటు చేయడానికి ఎప్‌స్టీన్ ప్రయత్నించినట్లు ఆ పత్రాలు సూచిస్తున్నాయి.
భారత విదేశాంగ శాఖ (MEA) స్పందన
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ప్రధాని మోడీ ప్రస్తావన, వివిధ సమావేశాలపై వైరల్ అవుతున్న వార్తలపై భారత విదేశాంగ శాఖ స్పందించింది. ఈ వార్తలపై భారత ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ దీనిపై స్పష్టత ఇచ్చారు. ఈ ప్రస్తావనలను ఒక నేరస్థుడి "చెత్త వదంతులు" (Trashy ruminations by a convicted criminal) గా కొట్టిపారేసింది.
అసలు వాస్తవం ఇదేనా..?
భారత ప్రధాని నరేంద్ర మోడీ 2017 లో ఇజ్రాయెల్ వెళ్లడం అనేది ఒక చారిత్రక దౌత్య పర్యటన అని, దానికి ఎప్‌స్టీన్ లాంటి వ్యక్తితో ఎలాంటి సంబంధం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక నేరస్థుడు తన ప్రయోజనాల కోసం, గొప్పల కోసం పెద్దల పేర్లు వాడుకున్నాడని (Name Dropping) ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఎప్‌స్టీన్ నేరాలకు సంబంధించి బయటపడిన "క్లయింట్ లిస్టు"లో కానీ, అతనికి సంబంధించిన దీవులకు వెళ్ళిన వారి జాబితాలో కానీ ప్రధాని మోడీ పేరు లేదు. ప్రధాని మోడీకి, ఎప్‌స్టీన్‌కు మధ్య ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం ఉన్నట్లు, వారు కలిసినట్లు ఎక్కడ ఆధారాలు లేవు. కానీ ప్రతిపక్షాలు (కాంగ్రెస్ సహా) మాత్రం ఈ అంశాన్ని రాజకీయ ఆయుధంగా మలుచుకున్నాయి. ప్రధాని మోడీ దీనిపై స్వయంగా వివరణ ఇవ్వాలని, విదేశీ శక్తుల ప్రభావం ప్రధాని నిర్ణయాలపై ఉందా అన్నది తేలాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు, బీజేపీ ఈ ఆరోపణలను దేశ ప్రతిష్టను దెబ్బతీసే కుట్రగా అభి వర్ణిస్తోంది.






