- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అల్-ఫలా యూనివర్సిటీ చైర్మన్ అరెస్ట్.. క్రైమ్ బ్రాంచ్ ఆఫీసుకు తరలింపు
అల్-ఫలా యూనివర్సిటీ (Al-Falah University) పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం ఆ సంస్థ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్ధిఖీ (Jawad Ahmed Siddiqui)ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: అల్-ఫలా యూనివర్సిటీ (Al-Falah University) పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లుగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇవాళ ఉదయం ఆ సంస్థ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్ధిఖీ (Jawad Ahmed Siddiqui)ని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు అతడిని ఢిల్లీ కోర్టు (Delhi Court)లో హాజరుపరచగా న్యాయస్థానం సిద్దిఖీకి నాలుగు రోజుల రిమాండ్ విధించింది. అయితే, అల్-ఫలా యూనివర్సిటీకి నాక్ (NAAC) గుర్తింపుతో పాటు UGC అనుమతులు ఉన్నట్లుగా తప్పుడు ప్రకటనలు ఇచ్చి, విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
కాగా, గతేడాది నవంబర్‌లో ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటన తర్వాత భద్రతా సంస్థలు ఈ యూనివర్సిటీపై దృష్టి సారించాయి. ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఈ యూనివర్సిటీకి చెందిన సుమారు రూ.140 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. 2018 నుంచి 2025 మధ్య కాలంలో ఈ విద్యాసంస్థ సుమారు రూ.415 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని, ఆ నిధులను సిద్ధిఖీ వ్యక్తిగత అవసరాలకు మళ్లించినట్లుగా ఈడీ విచారణలో తేలింది. ఈ యూనివర్సిటీకి చెందిన కొందరు వ్యక్తులకు ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నాయనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ప్రస్తుతం క్రైమ్ బ్రాంచ్ అధికారులు సిద్ధిఖీని విచారిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణ జరగనుంది.






