- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టాలిన్ సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది: ప్రధాని మోడీ
తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో బీజేపీ పార్టీ దూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) ఈరోజు ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మధురాంతకంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. అవినీతిలో కూరుకుపోయిన డీఎంకే(DMK) సర్కార్‌కు కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు. ప్రజలంతా డీఎంకే ప్రభుత్వానికి వీడ్కోలు పలకడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. స్వయంగా ప్రజలే మార్పు కోరుకుంటున్నారంటే పాలన ఎలా ఉందో అర్ధం చేసుకోవాలని కోరారు. రేపు తమిళనాడులో జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు.
కూటమి శ్రేణుల్లో కొత్త ఉత్సాహం
డీఎంకేలో రాజకీయంగా భవిష్యత్తు ఉండాలని కరప్షన్ చేయాల్సిందే అని హాట్ కామెంట్స్ చేశారు. తమిళనాడులో ప్రజా వ్యతిరేక డీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ప్రధాని మోడీ బహిరంగ సభలో ప్రకటించారు. ఎన్డీయే సుపరిపాలన, ప్రాంతీయ అభిరుచులకు ఇచ్చే ప్రాధాన్యత ప్రజలను ఆకట్టుకుంటోందని ప్రధాని మోడీ అన్నారు. ఈ సభ ద్వారా కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నింపడం, రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని మరింత వేగవంతం చేయడం ఎన్డీయే లక్ష్యం అని వెల్లడించారు. ఈ బహిరంగ సభలో కూటమిలోని కీలక భాగస్వామి పక్షాలైన అన్నాడీఎంకే, బీజేపీ, పీఎంకే, టీఎంసీ, ఏఎంఎంకే నేతలు పాల్గొన్నారు. రాష్ట్ర నలుమూలల నుండి కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు.






