"ప్రధాని మోడీకి ఆ ధైర్యం లేదు".. నరవాణే పుస్తకంతో రాహుల్ గాంధీ సవాల్

by Malleboina Mahesh |

లోక్‌సభ వేదికగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ "ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భవనం ముందు ఆయన మీడియాలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వంపై మరోసారి ఘాటు విమర్శలు చేశారు.

ప్రధాని మోడీకి ఆ ధైర్యం లేదు.. నరవాణే పుస్తకంతో రాహుల్ గాంధీ సవాల్
X

దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభ వేదికగా ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) "ప్రధాని మోడీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ భవనం ముందు ఆయన మీడియాలో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Central Govt)పై మరోసారి ఘాటు విమర్శలు చేశారు. 2020లో లడక్ సరిహద్దుల్లో చైనాతో జరిగిన సైనిక ఘర్షణల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ తన బాధ్యతలను నెరవేర్చడంలో విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' (Four Stars of Destiny) అనే అముద్రిత పుస్తకంలోని అంశాలను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంట్ వెలుపల మీడియాతో మాట్లాడిన రాహుల్.. "ప్రధానికి ఈరోజు లోక్‌సభకు వచ్చే ధైర్యం లేదని తాను భావిస్తున్నానని అన్నారు. ఒకవేళ ప్రధాని సభకు వస్తే.. నేను స్వయంగా వెళ్లి మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే (Former Army Chief General M.M. Naravane) రాసిన 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ (Four Stars of Destiny) పుస్తకాన్ని ఆయనకు అందిస్తాను. దేశ ప్రజలకు నిజం తెలియాలంటే ఆయన దీన్ని చదవాలి" అని సవాల్ విసిరారు. ఈ పుస్తకం ఉనికిలో లేదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, స్పీకర్ అంటున్నారని, కానీ లడఖ్ (Ladakh) వాస్తవ పరిస్థితులకు ఇది నిదర్శనమని ఈ సందర్భంగా రాహుల్ గాంధీ (Rahul Gandhi) పేర్కొన్నారు.

ఇంతకీ ఆ పుస్తకంలో ఏముంది

మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎం.ఎం. నరవాణే తన సర్వీస్‌లోని జ్ఞాపకాలను పుస్తకం రూపంలో రాశారు. దీనికి 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ (Four Stars of Destiny) అనే పేరు పెట్టారు. ఇందులోని కొన్ని కీలక అంశాలను రాహుల్ గాంధీ (Rahul Gandhi) లోక్ సభలో ప్రస్తావించారు. అవి.. చైనా ట్యాంకులు భారత భూభాగంలోకి (కైలాష్ రిడ్జ్) వస్తున్నాయని నరవాణే రక్షణ మంత్రికి, ఎన్ఎస్ఏ (NSA) కి ఫోన్ చేసినా మొదట ఎవరూ స్పందించలేదని ఆయన తెలిపారు. చివరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ, 'పైవారితో' మాట్లాడి చెబుతున్నారని, ఆ తర్వాత ప్రధాని నుండి "మీకు ఏది సరైంది అనిపిస్తే అది చేయండి" (Jo uchit samjho wo karo) అనే ఆదేశం వచ్చిందని రాహుల్ పేర్కొన్నారు. అటువంటి క్లిష్ట సమయంలో రాజకీయ నాయకత్వం బాధ్యత తీసుకోకుండా నిర్ణయాన్ని సైన్యంపైనే వదిలేసిందని, ఆ సమయంలో తాను చాలా ఒంటరినయ్యానని నరవాణే ఆ పుస్తకంలో రాశారని రాహుల్ వెల్లడించారు.

అయితే అసెంబ్లీ సమావేశాల్లో.. ఇంకా అధికారికంగా ప్రచురణ కానీ (Unpublished) పుస్తకాల నుండి అంశాలను ఉటంకించడం నిబంధనలకు విరుద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ తప్పుడు సమాచారంతో సైన్యం నైతిక ధైర్యాన్ని దెబ్బతీస్తున్నారని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మండిపడ్డారు. ఈ వివాదం కారణంగానే సభా మర్యాదలను ఉల్లంఘించారనే కారణంతో ఎనిమిది మంది ప్రతిపక్ష ఎంపీలను సభ నుంచి సస్పెండ్ చేయడం గమనార్హం.

Next Story