- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి.. ఆర్థిక సాయం ప్రకటన!
ఢిల్లీ మాల్వియా నగర్ అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ సంతాపం. పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ (PMNRF) నుండి మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ. 50 వేల ఎక్స్‌గ్రేషియా ప్రకటన.

దిశ, వెబ్ డెస్క్: భారత రాజధాని నగరం అయిన ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకొని 20 మంది ప్రాణాలు కోల్పోయారు. బుధవారం ఉదయం మాల్వియా నగర్ లెమన్ గ్రీన్ రెస్టారెంట్‌లో ఈ ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో మొదట 10 మంది ప్రాణాలు కోల్పోగా.. సహాయక చర్యలు చేపట్టిన అనంతరం మరో పదిమంది మృతదేహాలను ఫైర్, పోలీస్ అధికారులు గుర్తించారు. దీంతో మృతుల సంఖ్య 20 కి చేరింది. అలాగే ఈ ప్రమాదం నుంచి 35 మంది పోలీసులు సురక్షితంగా కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. ఈ షాకింగ్ ఘటనలో
20 మంది ప్రాణాలు కోల్పోవడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దురదృష్టకర ప్రమాదం తనను ఎంతగానో కలచివేసింది ఆయన పేర్కొన్నారు. ఈ అగ్నికీలల్లో చిక్కుకుని తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని తన ఘాడ సానుభూతిని తెలియజేశారు. అలాగే, ఈ ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు అందరూ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. అగ్నిప్రమాదం కారణంగా ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ స్థానిక అధికారులు, యంత్రాంగం అన్ని విధాలా సాధ్యమైన సహాయాన్ని అందిస్తున్నారని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ (PMNRF) నుంచి ఎక్స్‌గ్రేషియా
ఈ అగ్నిప్రమాద ఘటనలో మరణించిన ప్రతి ఒక్కరి కుటుంబానికి (మృతుల వారసులకు) ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (PMNRF) నుంచి రూ. 2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా (ఆర్థిక సహాయం) అందించనున్నట్లు ప్రధాని ప్రకటించారు. దీంతో పాటు, ఈ ప్రమాదంలో గాయపడిన బాధితులకు రూ. 50,000 చొప్పున ఆర్థిక సాయం అందజేయనున్నట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది.






