- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం రేవంత్ రెడ్డికి ధర్వేశిపురం శ్రీ ఎల్లమ్మ ఆలయ అర్చకుల పూర్ణకుంభ స్వాగతం
by Ratna Kumari |
నల్లగొండలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభ సందర్భంగా ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు.

X
దిశ, కనగల్ : నల్లగొండలో ఆదివారం నిర్వహించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభ సందర్భంగా ధర్వేశిపురం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ అర్చకులు ముఖ్యమంత్రికి సంప్రదాయబద్ధంగా పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఆలయ ముఖ్య అర్చకులు నాగోజు మల్లాచారి, అర్చకులు గాదే ఉమామహేశ్వరరావు వేదమంత్రోచ్చారణల నడుమ పూర్ణకుంభంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించి, ఆలయ సంప్రదాయం ప్రకారం కంకణం కట్టారు. ఈ సందర్భంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి తీర్థప్రసాదాలను ముఖ్యమంత్రికి అందజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులు, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారి ఆశీస్సులను ముఖ్యమంత్రికి అందజేసినట్లు అర్చకులు తెలిపారు.
Next Story






