- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి వృధాను అరికట్టండి.. ఆరుతడి పంటలను వేయండి : ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలైన కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ వంటివి సాగు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు.

దిశ, అక్బర్ పేట భూంపల్లి : ఎల్నినో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున రైతులు వరి సాగును తగ్గించి ఆరుతడి పంటలైన కూరగాయలు, పండ్ల తోటలు, ఆయిల్ పామ్ వంటివి సాగు చేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి సరఫరా చేస్తున్న మిషన్ భగీరథ మంచి నీటిని పొదుపుగా వాడుకోవాలని, లీకేజీలు, నీటి వృధాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు. సోమవారం మండలంలోని భూంపల్లి రైతు వేదికలో మండల ప్రజాపరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన "మండల స్థాయి అధికారుల సమీక్ష సమావేశానికి రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అక్బర్ పేట భూంపల్లి మండలం ఏర్పడ్డ నాలుగేళ్లకు తొలిసారిగా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, ప్రతి 40 రోజులకు ఒకసారి మండల ప్రగతి పై సమీక్ష సమావేశాలను తప్పకుండా నిర్వహిస్తామని చెప్పారు. మండలంలోని అన్ని గ్రామాల్లో వీబీజీరాంజీ ద్వారా అమలవుతున్న స్కీంలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
మండలంలో సన్న వరిని, అలాగే ఉద్యాన పంటలైన పండ్లు, కూరగాయలు, ఆయిల్ ఫామ్ పంటల సాగును పెంచేలా వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. గ్రామాల్లో బోర్ల వాడకాన్ని క్రమక్రమంగా తగ్గించి మిషన్ భగీరథ ద్వారా సరఫరా అవుతున్న మంచినీటినే పొదుపుగా వాడుకోవాలని సూచించారు. గ్రామాల్లో ఓవర్ లోడ్, కరెంట్ సమస్యలు తలెత్తకుండా ఆ శాఖ అధికారులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, మండలానికి వెయ్యి నూతన కరెంట్ పోల్ లను, ఏబీ స్విచ్ లను బిగించాలన్నారు. అన్ని శాఖల అధికారులు మండలంలోని సర్పంచులను తప్పనిసరిగా కలుస్తూ మండల అభివృద్ధిలో భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా డీఆర్డీఏ పీడీ జయదేవ్ ఆర్య మాట్లాడుతూ వీబీజీరాంజీ ద్వారా చేపట్టనున్న పనులను సర్పంచ్లు, పంచాయతీ సెక్రెటరీలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ గాంధారి నరేందర్ రెడ్డి, డీపీఓ రవీందర్, డీఎల్ పీఓ చందన, ఎంపీడీవో సోమిరెడ్డి, తహశీల్దార్ బాలరాజు, ఏఎంసీ చైర్మన్ లు కొంగర రవి, బొమ్మెర సంయుక్త, పీఏసీఎస్ చైర్మన్ షేర్ల కైలాష్, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు కుమార్, సర్పంచులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.






