- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ 12 ఏళ్ల పాలన.. రాష్ట్రపతి అభినందనలు
భారతదేశ రాజకీయ ప్రస్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు.

దిశ, వెబ్ డెస్క్ : భారతదేశ రాజకీయ ప్రస్థానంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త చరిత్ర సృష్టించారు. దేశ ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. భారతదేశ చరిత్రలోనే ఒక నేత వరుసగా 12 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ప్రధానమంత్రిగా కొనసాగడం ఇదే ప్రథమం కావడం విశేషం. ఈ అరుదైన మైలురాయిని అధిగమించిన సందర్భంగా రాష్ట్రపతి భవన్ ఒక ప్రత్యేక సందేశాన్ని విడుదల చేసింది. "ప్రధాని నరేంద్ర మోడీ సమర్థవంతమైన నాయకత్వంపై దేశ ప్రజలకు ఉన్న అచంచలమైన నమ్మకానికి, విశ్వాసానికి ఈ 12 ఏళ్ల సుదీర్ఘ పాలన ఒక నిదర్శనం" అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము కొనియాడారు. గడిచిన ఈ 12 ఏళ్ల కాలంలో ప్రధాని మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారతదేశం ఆర్థిక, సామాజిక, సాంకేతిక రంగాలలో అభివృద్ధి మార్గంలో వేగంగా పయనిస్తోందని ఆమె అభినందించారు. మరోవైపు ప్రధాని మోడీ 12 ఏళ్ల సుదీర్ఘ పాలనను అభినందిస్తూ కేంద్ర క్యాబినెట్ తీర్మానం చేసింది.






