దీపారాధన చేసేటప్పుడు జాగ్రత్త.. హేయిర్ లీవ్ చేస్తే ఈ ప్రమాదం జరగవచ్చు ?

by samatah |   ( Updated:2022-03-18 03:16:23.0  )
దీపారాధన చేసేటప్పుడు జాగ్రత్త.. హేయిర్ లీవ్ చేస్తే ఈ ప్రమాదం జరగవచ్చు ?
X

దిశ, వెబ్‌డెస్క్ : చాలా మంది దీపారాధన చేసేటప్పుడు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు. అయితే కొంత మంది పూజా చేసే విధానం లేక దీపారాధన నియమాలు తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటారు. మరికొందరు జాగ్రత్తలు తీసుకోవడంలో పొరపాటు చేస్తూ ఉంటారు. చాలా మంది పెద్దలు అంటారు గుడిలోకి వచ్చేటప్పుడు జుట్టు విరబోసుకొని రాకుడదు అని.. వారు చెప్పినదాంట్లో కూడా మనకు మంచి చేసేదే ఉంటుంది అనడానికి ఈ సంఘటనే నిదర్శనం. అయితే జుట్టు విరబోసుకొని ఓ అమ్మాయి దీపారాధన చేసి చివరకు సమస్యలో ఇరుక్కుంది.

అయితే ఓ అమ్మాయి ఎంతో భక్తితో దేవునికి దీపారాధన చేస్తోంది.హేయిర్ లీవ్ చేసుకొని రెండు చేతుల్లో ప్రమిదలు పట్టుకొని తన ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ.. దేవున్నికి నిండు మనస్సుతో దీపారాధన చేస్తోంది. అంతలోనే దగ్గరలో ఉన్న ప్రమిదలు తన జుట్టుకు అంటుకొంది. దాంతో ఆ అమ్మాయి గట్టిగా అరవడంతో చుట్టుపక్కల వారు తనకు అంటుకున్న మంటలను ఆర్పారు. అనంతరం తాను తన చేతిలో ప్రమిదలను పారేసింది. జుట్టు సగం కాలిపోయి కొంత వరకు చర్మం కాలడంతో ఆమెను తన కుటుంబసభ్యులు దగ్గరిలోని డాక్టర్‌కు చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియో చూసిన వారందరూ దీపారాధన చేసేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.



Next Story

Most Viewed