వర్షాలు కురవాలని గ్రామదేవతలకు పూజలు

by Batti.Sumithra |

తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వర్షాలు కురవాలని పాల్వంచ మండల కేంద్రంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

వర్షాలు కురవాలని గ్రామదేవతలకు పూజలు
X

దిశ, పాల్వంచ : తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో వర్షాలు కురవాలని పాల్వంచ మండల కేంద్రంలో గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ కూచని శేఖర్ ఆధ్వర్యంలో గ్రామదేవతలైన నల్లపోచమ్మ, ముత్యాలమ్మ తదితర దేవతలకు గంగాజలంతో స్నానం చేయించి ప్రత్యేక పూజలు చేశారు. ఎల్‌నినో ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో రైతులు వేసిన పంటలు ఎండిపోతున్నాయి. గ్రామ సంప్రదాయం ప్రకారం వర్షం కోసం ప్రార్థిస్తూ డోలు, మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. మహిళలు తలలపై కలశాలు ధరించి వేపరెమ్మలతో ఊరేగింపులో పాల్గొన్నారు. గ్రామ దేవతలతో పాటు గ్రామంలోని అన్ని దేవాలయాల్లో కొబ్బరికాయలు కొట్టి, అభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వర్షాలు కురిపించి రైతులను ఆదుకోవాలని గ్రామదేవతలను వేడుకున్నారు. వాతావరణ మార్పుల వల్ల ఏర్పడిన కరువు పరిస్థితుల నుంచి బయటపడాలని, పంటలు బాగా పండాలని మొక్కులు చెల్లించారు. అనంతరం గ్రామపంచాయతీ పాలకవర్గం మాట్లాడుతూ, "ప్రకృతిని కాపాడుకోవాలని" సూచించారు.

Next Story