కవితతో కలిసి పని చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ప్రశాంత్ కిషోర్

by Malleboina Mahesh |   (  Updated:2026-01-20 06:05:30  IST  )

మాజీ ఎంపీ, జాగృతి అధ్యక్షురాలు కవిత తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. కొత్త రాజకీయ పార్టీ పెట్టున్నట్లు తెలంగాణ శాసన మండలిలో ప్రకటించిన విషయం తెలిసిందే.

కవితతో కలిసి పని చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై స్పందించిన ప్రశాంత్ కిషోర్
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavita) తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తర్వాత.. కొత్త రాజకీయ పార్టీ పెట్టున్నట్లు తెలంగాణ శాసన మండలిలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ పార్టీ కోసం కవిత, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishore)తో కలిసి పని చేయనున్నట్లు అనేక వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఏర్పాటు చేయబోయే కొత్త రాజకీయ పార్టీకి తాను వ్యూహకర్తగా వ్యవహరించబోతున్నట్లు వస్తున్న వార్తలను ప్రశాంత్ కిషోర్ తీవ్రంగా ఖండించారు. గత కొన్ని రోజులుగా మీడియాలో, సోషల్ మీడియాలో కవితతో తాను రెండు సార్లు భేటీ అయ్యానని, తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటుపై చర్చలు జరిగాయని వస్తున్న కథనాలు కేవలం పుకార్లేనని ఆయన స్పష్టం చేశారు.

ఈ లీకులు పూర్తిగా అవాస్తవమని, తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని పీకే తేల్చి చెప్పారు. తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీకి అవకాశం ఉందని తాను అన్నట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని కూడా ఆయన తోసిపుచ్చారు. కవిత తో కలిసి పని చేయబోతున్నట్లు వస్తున్న వార్తలు కేవలం ఊహాగానాలేనని, తన రాజకీయ ప్రయాణం, వ్యూహాలకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా తానే స్వయంగా వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఈ వివరణతో గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో కవిత కొత్త పార్టీ, పీకే వ్యూహాలపై జరుగుతున్న చర్చకు ప్రస్తుతానికి తెరపడినట్లయింది.

Next Story