Pranitha Subhash: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. వైరల్‌గా మారిన పోస్ట్

by Disha Web Desk 12 |
Pranitha Subhash: తల్లి కాబోతున్న స్టార్ హీరోయిన్.. వైరల్‌గా మారిన పోస్ట్
X

దిశ, సినిమా: ప్రముఖ కన్నడ నటి ప్రణితా సుభాష్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన భామ.. దేవుడు తమ దంపతులకు గొప్ప బహుమతి ఇచ్చాడని ఆనందం వ్యక్తం చేసింది. ప్రెగ్నెన్సీ టెస్ట్‌కు సంబంధించిన ఫలితాలతోపాటు తన భర్తను ప్రేమగా హత్తుకున్న పిక్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన భామ.. 'నా భర్త 34వ పుట్టినరోజుకు ముందే దేవదూతలు మాకు గొప్ప బహుమతిని అందించారు' అని క్యాప్షన్ ఇచ్చింది. కాగా ఈ పోస్ట్‌పై స్పందించిన పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక ఈ బాపు బొమ్మ బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును గతేడాది మ్యారేజ్ చేసుకున్న సంగతి తెలిసిందే.

Next Story

Most Viewed