- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
KA Paul: భారత్‌కు కాబోయే రాష్ట్రపతి అతనే.. కేఏ పాల్ జోస్యం
KA Paul has Nominated a person for presidential election| రాష్ట్రపతి ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయేకు తటస్థ అభ్యర్థిని నిలబెటితే మంచిదని అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: KA Paul has Nominated a person for presidential election| రాష్ట్రపతి ఎన్నికలపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ జోస్యం చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్డీయేకు తటస్థ అభ్యర్థిని నిలబెటితే మంచిదని అన్నారు. బీజేపీ నిలబెట్టే అభ్యర్థి 60 శాతం ఓట్లతో గెలువబోతున్నారని తెలిపారు. ప్రతిపక్షాల మధ్య ఐక్యత లేదని అదే బీజేపీకి లాభిస్తుందని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్లే దేశం నాశనం అయిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేసిన పాల్.. రాష్ట్రపతి అభ్యర్థిగా తాను ఓ వ్యక్తి పేరును ఎన్డీయేకు సూచించానని చెప్పారు. ప్రస్తుతం దేశం క్లిష్టపరిస్థితుల్లో ఉందని ఈ సంగతి మోడీ, అమిత్ షాకు తెలియజేశానని వివరించారు. తాను ఓడిపోయే అభ్యర్థి పక్షాన ఉండటానికి ఇష్టపడటం లేదని, విపక్షాల్లో రాష్ట్రపతి అభ్యర్థి విషయంలో ఏకాభిప్రాయం లోపించిందన్నారు. ప్రతిపక్షాలు ఐక్యంగా లేకపోవడంతోనే బీజేపీ బలంగా కనిపిస్తోందని చెప్పారు. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై కయ్యానికి కాలు దువ్వుతున్న కేఏ పాల్ ఈసారి కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. సేవ్ సెక్యులర్ కూటమి తరపున రాష్ట్రపతి ఎన్నికల్లో సొంత అభ్యర్థిని నిలబెట్టే విషయంలో తాను కేసీఆర్‌తో చర్చించినట్లు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పార్టీకి ఎంపీలే ఉండరని అన్నారు. ఇకనైనా విపక్షాలు ఏకతాటిపై ఉండాలని పాల్ సూచించారు.
- Tags
- KA Paul






