Adipurush ఎడిట్ వెర్షన్‌‌తో ప్రభాస్ హ్యాపీ.. ఎందుకంటే

by Manoj |   (  Updated:2022-07-01 07:41:39  IST  )

Prabhas and Kriti Sanon's Chemistry to be the highlighted of the Adipurush| ఏ మూవీకైనా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ప్రేక్షకులు ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసే అంశాల్లో ఇదీ ఒకటి. ఇటీవల విడుదలైన 'రాధే శ్యామ్' చిత్రంలో ప్రభాస్, పూజ శాశ్వత ప్రేమికులుగా కనిపించారు గానీ వారి

Prabhas and Kriti Sanons Chemistry to be the highlighted of the Adipurush
X

దిశ, సినిమా : Prabhas and Kriti Sanon's Chemistry to be the highlighted of the Adipurush| ఏ మూవీకైనా హీరో హీరోయిన్ కెమిస్ట్రీ చాలా ఇంపార్టెంట్. ప్రేక్షకులు ఎక్కువగా ఎక్స్‌పెక్ట్ చేసే అంశాల్లో ఇదీ ఒకటి. ఇటీవల విడుదలైన 'రాధే శ్యామ్' చిత్రంలో ప్రభాస్, పూజ శాశ్వత ప్రేమికులుగా కనిపించారు గానీ వారి కెమిస్ట్రీ ఆడియన్స్‌ను పెద్దగా ఆకట్టుకోలేదు. కథాపరంగా ఫీల్ ఉన్నప్పటికీ స్క్రీన్‌పై మాత్రం మ్యాజిక్ వర్కవుట్ కాలేదు.

ఇదే విషయమై ప్రభాస్ కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ప్రభాస్ అప్‌కమింగ్ ఫిల్మ్ 'ఆదిపురుష్' ఎడిట్ వెర్షన్‌ను ఆ మూవీ టీమ్ మొత్తం వీక్షించారని సమాచారం. అంతేకాదు ఈ చిత్రంలో సీతారాములుగా నటించిన ప్రభాస్, కృతి సనన్ మధ్య కెమిస్ట్రీని మనోహరంగా తెరకెక్కించిన దర్శకుడు ఓం రౌత్‌ను అందరూ ప్రశంసించడం సినిమాపై ఎక్స్‌పెక్టేషన్స్ పెంచుతోంది. ప్రస్తుతం బాలీవుడ్ సహా సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఈ సినిమా గురించే మాట్లాడుకుంటుండగా.. అసలు రామాయణాన్ని దర్శకుడు ఎలా చూపించబోతున్నాడని అభిమానులు ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నారు.

Next Story