మారుతి-ప్రభాస్ కాంబో మూవీ.. ఆ సినిమా ఫ్రీమేక్..?

by Dishafeatures2 |
మారుతి-ప్రభాస్ కాంబో మూవీ.. ఆ సినిమా ఫ్రీమేక్..?
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ 'రాధేశ్యామ్'తో బాక్సాఫీస్ వద్ద మంచి విజయం అందుకున్నాడు. ఆశించిన రేంజ్‌లో సినిమా ఆకట్టుకోలేక పోయినా. బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లే రాబట్టింది. అయితే 'రాధేశ్యామ్'తో ఫ్యాన్స్ అంతగా ఆకట్టుకోలేక పోవడంతో ప్రభాస్ సరికొత్త ప్లాన్ చేశాడు. తన తదుపరి సినిమాతో అభిమానులకు నెవ్వర్ బిఫోర్ ట్రీట్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. అందుకే తన నెక్స్ట్ మూవీని కమర్షియల్ డైరెక్టర్ మారుతిని ఫిక్స్ చేశాడట. సోషల్ మీడియాలో ఇదే హాట్ టాపిక్.

అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. కానీ నెట్టింట మాత్రం వీరి కాంబోపై అనేక వార్తలు వస్తున్నాయి. అంతేగాకుండా ఈ సినిమా స్టోరీ లైన్, జానర్, నటీనటులపై కూడా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఈ మూవీ ఓ కామెడీ హారర్ మూవీ అని, ఈ సినిమాలో ప్రభాస్ కొత్తగా కనిపించనున్నాడని టాక్ నడుస్తోంది. అంతేగాకుండా ఈ మూవీ హాలీవుడ్ మూవీ ఫ్రీరీమేక్‌గా తెరకెక్కుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్రీమేక్ అంటే ఓ సినిమా నుంచి ఒక సీన్ లేదా కథను కాపీ చేయడం. కానీ మారుతి ఫ్రీమేక్ చేయనున్న హాలీవుడ్ మూవీ అనేది క్లారిటీ లేదు. దీనిపై త్వరలో ఏమైనా క్లారిటీ వస్తుందేమో చూడాలి.

Next Story

Most Viewed