పులిచెర్ల సబ్‌స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేత

by Batti.Sumithra |   (  Updated:2026-07-15 16:38:07  IST  )

పెద్దవూర మండల పరిధిలో గురువారం (16-07-2026) ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 గంటల వరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్ షిఫ్టింగ్ పనులు జరుగనున్న నేపథ్యంలో 132/33 కేవీ కోదండపురం నుంచి 33 కేవీ పులిచెర్ల ఫీడర్, 33 కేవీ పెద్దవూర ఫీడర్‌లకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జానయ్య తెలిపారు.

పులిచెర్ల సబ్‌స్టేషన్ పరిధిలో గురువారం విద్యుత్ సరఫరా నిలిపివేత
X

దిశ, పెద్దవూర : పెద్దవూర మండల పరిధిలో గురువారం (16-07-2026) ఉదయం 09:00 గంటల నుంచి మధ్యాహ్నం 02:00 గంటల వరకు హెచ్‌ఎండబ్ల్యూఎస్ షిఫ్టింగ్ పనులు జరుగనున్న నేపథ్యంలో 132/33 కేవీ కోదండపురం నుంచి 33 కేవీ పులిచెర్ల ఫీడర్, 33 కేవీ పెద్దవూర ఫీడర్‌లకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జానయ్య తెలిపారు. 33 కేవీ/11 కేవీ పులిచెర్ల సబ్‌స్టేషన్ పరిధిలోని పులిచెర్ల, ఊట్లపల్లి, గేమ్యానాయక్ తండా, కోమటికుంట తండా, బాసన్‌బాయ్ తండా, కంసానిగూడెం, గడ్డమీది తండా, యల్లాపురం, పెద్దగట్టు, బూడిదగట్టు, జక్కలోని బావి, బాణాలకుంట తండా, జగ్రామ్ తండా గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని తెలిపారు. కావున గృహ, వాణిజ్య వినియోగదారులు, రైతులు విద్యుత్ శాఖ సిబ్బందికి, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు.

Next Story