హారిక ద్రోణవల్లికి పోర్న్ వేధింపులు: ప్రపంచ చెస్ సమాఖ్య

by Web Desk |
హారిక ద్రోణవల్లికి పోర్న్ వేధింపులు: ప్రపంచ చెస్ సమాఖ్య
X

న్యూఢిల్లీ : వరల్డ్ నెంబర్- 11 భారత చెస్ క్రీడాకారిణి, గ్రాండ్ మాస్టర్ హారిక ద్రోణవల్లికి చేదు అనుభవం ఎదురైంది. నవంబర్ 2021 లాట్వియాలో గేమ్ ఆడేందుకు వెళ్లిన హారిక ద్రోణవల్లి పోర్న్ వేధింపులను ఎదుర్కొన్నారు. ఈ జాబితాలో మరికొంత మంది క్రీడాకారిణులు కూడా ఉన్నట్లు తెలిసింది. టోర్నమెంట్‌ చివరి రోజు హారిక ద్రోణవల్లితో పాటు పలువురు క్రీడాకారిణుల మెయిల్ ఐడీకి గుర్తుతెలియని అకౌంట్స్ నుంచి మెయిల్స్ వచ్చాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా అందులో పోర్న్ చిత్రాలు ఉన్నట్టు తెలిసింది. ఈ విషయం పై తోటి క్రీడాకారిణులతో కలిసి హారిక ఇంటర్నేషనల్ చెస్ ఫెడరేషన్ సమాఖ్య (ఫైడ్)కు ఫిర్యాదు చేసింది. దీంతో రిగాలోని స్విస్ టోర్నమెంట్ నిర్వాహకులతో పాటు ఫైడ్ కూడా దీనిపై ప్రత్యేకంగా విచారణ ప్రారంభించింది. తాజాగా ఈ విషయాన్ని లాట్వియాలోని పోలీసులు విచారిస్తున్నట్లు ప్రపంచ చెస్ సమాఖ్య సోమవారం వెల్లడించింది. కాగా, రష్యా మీడియా మెడుజా నివేదిక ప్రకారం 2009 నుంచి మహిళా చెస్ క్రీడాకారులకు ఇలాంటి మెయిల్స్ వస్తున్నట్టు అధికారులు గుర్తించారు.


Next Story

Most Viewed