- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్‌కు జైలు శిక్ష
by Muthe.Rajitha |
పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష పడటం అంతర్జాతీయ మీడియాలో సంచలనం రేపింది.

X
దిశ, వెబ్ డెస్క్ : పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ కు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జైలు శిక్ష పడటం అంతర్జాతీయ మీడియాలో సంచలనం రేపింది. మార్చి 2026లో కాలిఫోర్నియాలోని వెంచురా కౌంటీలో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన బ్రిట్నీపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, మే 4న జరిగిన కోర్టు విచారణలో కోర్టు ఒక రోజు జైలుశిక్ష విధించింది. అయితే ఆమెను అరెస్టు చేసిన సమయంలో కస్టడీలో గడిపిన సమయాన్ని ఆ ఒక రోజు శిక్ష కింద జమచేస్తూ బిగ్ రిలీఫ్ ఇచ్చారు న్యాయమూర్తులు. అయినప్పటికీ కోర్ట్ కొన్ని కఠినమైన షరతులను విధించింది. ఇందులో భాగంగా ఆమె 12 నెలల పాటు ప్రొబేషన్ తోపాటు, మూడు నెలల పాటు 'సబ్‌స్టాన్స్ అబ్యూజ్ ప్రోగ్రామ్'లో పాల్గొనడం తప్పనిసరి అని ఆదేశించింది. వీటితో పాటు సుమారు 571 డాలర్ల జరిమానాను కూడా చెల్లించాల్సి ఉంటుంది.
Next Story






