- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Killer Movie: ‘కిల్లర్’ నుంచి పూర్వాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్..
ప్రస్తుతం, ‘కిల్లర్’ ( Killer ) అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు

దిశ, వెబ్ డెస్క్ : శుక్ర, మాటరాని మౌనమిది, ఏ మాస్టర్ పీస్.. లాంటి సినిమాలతో దర్శకుడు పూర్వాజ్ ( Poorvaj ) అందర్ని ఆకట్టుకుంటున్నాడు. ప్రస్తుతం, ఇతను ‘కిల్లర్’ ( Killer ) అనే యాక్షన్ థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీలో జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో నటించగా.. అయితే, ఆమె ఫస్ట్ లుక్ ని ఎప్పుడో రిలీజ్ చేశారు. ఈ సినిమాలో రోబోటిక్ తో పాటు క్రైం, యాక్షన్ ఉంటుందని అర్ధమవుతుంది.
అయితే, ఈ చిత్రంలో డైరెక్టర్ పూర్వాజ్ కూడా కీలక పాత్రలో నటించాడు. తాజాగా పూర్వాజ్ ఫస్ట్ లుక్ ని మేకర్స్ విడుదల చేశారు. ఈ లుక్ లో పూర్వాజ్ చేతిలో రివాల్వర్ పట్టుకుని సీరియస్ గా కనిపించారు. ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థతో కలిసి థింక్ మూవీ పతాకం పై పూర్వాజ్ ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మాణంలో పూర్వాజ్ డైరెక్షన్ లో ఈ మూవీ తెరకెక్కుతుంది. ఇక, ఈ మూవీ రెండు పార్ట్ లుగా మన ముందుకు రానుందని తెలుస్తుంది.






