Poojita Ponnada: చేతికి సెలైన్ పెట్టుకుని ఆసుపత్రి బెడ్‌పై నున్న ఫొటో షేర్ చేసిన స్టార్ నటి.. ఆందోళనలో ఫ్యాన్స్..!!

by Kodari Anjali |

టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో అవకాశం కొట్టేసి.. మరింత ఫేమ్ దక్కించుకుంది నటి పూజిత పొన్నాడ(Poojita Ponnada).

Poojita Ponnada: చేతికి సెలైన్ పెట్టుకుని ఆసుపత్రి బెడ్‌పై నున్న ఫొటో షేర్ చేసిన స్టార్ నటి.. ఆందోళనలో ఫ్యాన్స్..!!
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన రంగస్థలం చిత్రంలో అవకాశం కొట్టేసి.. మరింత ఫేమ్ దక్కించుకుంది నటి పూజిత పొన్నాడ(Poojita Ponnada). సమంత(Samantha)-రామ్ చరణ్(Ram Charan) కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీతో పూజిత సినిమాల్లో వరుస అవకాశాలు దక్కించుకుంటోంది. ఈ అమ్మడు షార్ట్ ఫిలిమ్స్ తో తన కెరీర్ స్టార్ట్ చేసింది. తర్వాత రాజు గాడు(Rāju gāḍu), హ్యాపీ వెడ్డింగ్, బ్రాండ్ బాబు(Brand Babu), ఏడు, రన్, మిన్ ఇండియా(Miss India), కల్కి(Kalki), మనీషే, కథ కంచికి మనం ఇంటికి(Katha kan̄ciki manaṁ iṇṭiki) వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి.. టాలీవుడ్ పరిశ్రమలో నటిగా తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టగా.. అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఫొటోలో పూజిత చేతికి సెలైన్ పెట్టుకుని ఆసుపత్రిలో బెడ్‌పైన ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ పిక్ కు ‘ఈసారి భారతదేశం నన్ను స్వాగతించింది’ అంటూ క్యాప్షన్ జోడించింది. మరీ ఈ బ్యూటీకి ఏం జరిగిందన్న దానిపై క్లారిటీ లేనప్పటికీ పూజిత త్వరగా కోలుకోవాలని నెటిజన్లు నెట్టింట కామెంట్లు చేస్తున్నారు.

Next Story