- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళం, అస్సాం, పుదుచ్ఛేరిలో నేడే పోలింగ్
నేడు కేరళం, అస్సాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది.

దిశ, వెబ్ డెస్క్ : నేడు కేరళం, అస్సాంతోపాటు కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరి అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభం కానుండగా.. సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఇక వీటి ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
కేరళ : రాష్ట్రంలోని మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. అధికార ఎల్‌డీఎఫ్ (LDF) వరుసగా మూడవసారి అధికారాన్ని చేజిక్కించుకోవాలని చూస్తుండగా, యూడీఎఫ్ (UDF) మరియు ఎన్డీయే (NDA) గట్టి పోటీనిస్తున్నాయి. కేరళలో మొత్తం 2.71 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
అస్సాం : అస్సాంలోని మొత్తం 126 స్థానాలకు నేడు ఒకే విడతలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. గతంలో బహుళ విడతల్లో జరిగిన ఎన్నికలు, ఈసారి కేవలం ఒక్క రోజులోనే ముగియడం గమనార్హం. ఇక్కడ ప్రధాన పోటీ ఎన్డీయే, ఇండియా కూటమి మధ్యే ఉంది.
పుదుచ్చేరి : కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమి, కాంగ్రెస్-డీఎంకే కూటముల మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఎన్నికల సంఘం ఇక్కడ డ్రోన్ల ద్వారా పర్యవేక్షణ చేపడుతూ భద్రతను కట్టుదిట్టం చేసింది.






