తొర్రూరులో పొలిటికల్ వార్.. రంగంలోకి RAF బలగాలు..ఎంపీ కడియం కావ్య ఓటు పై ఉత్కంఠ!

by Malleboina Mahesh |

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. బీఆర్ఎస్‌కు మెజారిటీ ఉన్నప్పటికీ, ఎంపీ కడియం కావ్య ఎక్స్-అఫీషియో ఓటు నమోదు చేసుకోవడం వివాదంగా మారింది.

తొర్రూరులో పొలిటికల్ వార్.. రంగంలోకి RAF బలగాలు..ఎంపీ కడియం కావ్య ఓటు పై ఉత్కంఠ!
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 13 జరిగిన మున్సిపల్ ఓట్ల లెక్కింపుల 34 మున్సిపాలిటీల్లో హంగ్ వచ్చిన విషయం తెలిసిందే. వీటితో పాటు 17 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీకి లీడ్ వచ్చింది. దీంతో అధికారం కాంగ్రెస్ పార్టీ వీలున్న చోట బీఆర్ఎస్ కు చైర్మన్ సీటును దక్కకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగానే మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరు మున్సిపాలిటీలో ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే యశస్వీలు ఎక్స్ అఫిషియో ఓట్లను నమోదు చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది.

2025 లో వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్న కడియం కావ్య ఇప్పుడు తొర్రూరు మున్సిపాలిటీ ఓటు వేడయానికి సిద్ధం కావడం తీవ్ర చర్చకు దారితీసింది. దీంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. 2019 మున్సిపల్ యాక్ట్ ప్రకారం ఎక్స్ అఫిషియో గా ఎక్కడైతే ఓటు నమోదు చేసుకుంటారో, వారి పదవీ కాలం ముగిసే వరకు అక్కడే ఓటు వేయాల్సి ఉంది. కానీ నిబంధనలకు విరుద్ధంగా తొర్రూరు మున్సిపాలిటీలో ఎక్స్ అఫిషియో ఓటు నమోదు చేసుకున్నారని కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. మరికొద్ది క్షణాల్లో చైర్మన్ ఎన్నిక జరగున్న నేపథ్యంలో కమిషనర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.

రణరంగంగా మారిన తొర్రూరు.. రంగంలోకి RAF బలగాలు

బీఆర్ఎస్ కు స్పష్టమైన మెజారిటీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో తొర్రూరు మున్సిపాలిటి రణరంగంగా మారింది. మున్సిపల్ కేంద్రం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. అలాగే అవాంచనీయ ఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉండటంతో RAF బలగాలు రంగంలోకి దిగాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పోలీసులు మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల బీఎన్ఎస్ 163 సెక్షన్ అమలు చేశారు. ఇదిలా ఉంటే క్యాంపులో ఉన్న కౌన్సిలర్లు వస్తున్న బస్సును భువనగిరి ఎంపీ, అనుచరులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తు తిరగబడటం తో కాంగ్రెస్ నేతలు తప్పుకున్నట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక తొర్రూరులో రణరంగాన్ని తలపిస్తుంది.

Next Story