'జన నాయగన్' సినిమా చుట్టూ రాజకీయ రగడ.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్

by Malleboina Mahesh |   (  Updated:2026-01-13 09:02:05  IST  )

టీవీకే అధినేత, తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయగన్' చిత్రం విడుదలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఆ సినిమా విడుదల సందిగ్ధత కాస్తా తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది.

జన నాయగన్ సినిమా చుట్టూ రాజకీయ రగడ.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: టీవీకే అధినేత, తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన 'జన నాయకన్' చిత్రం ('Jananayakan' movie) విడుదలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఆ సినిమా విడుదల సందిగ్ధత కాస్తా తీవ్ర రాజకీయ దుమారానికి దారితీసింది. ఈ చిత్రాన్ని అడ్డుకోవడానికి కేంద్రం ప్రయత్నాలు చేస్తుందని, ఇది కేవలం సినిమాపై నిషేధం కాదని, తమిళ సంస్కృతిపై జరుగుతున్న దాడి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) తీవ్రంగా మండిపడ్డారు. ప్రధాని మోడీ ఎంత ప్రయత్నించినా తమిళ ప్రజల గొంతును అణిచివేయలేరని ఆయన స్పష్టం చేశారు. విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగు పెట్టిన నేపథ్యంలో, ఈ చిత్రంలోని రాజకీయ అంశాల (political overtones) కారణంగానే కేంద్రం అడ్డంకులు సృష్టిస్తోందనే వాదనను రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా తెరపైకి తెచ్చారు.

మరోవైపు, ఈ వ్యవహారం న్యాయపరంగా ఉత్కంఠ రేపుతోంది. చిత్రానికి వెంటనే సెన్సార్ సర్టిఫికెట్ (CBFC) ఇవ్వాలని సింగిల్ జడ్జి తీర్పు పై మద్రాస్ హైకోర్టు స్టే విధించడంతో సినిమా భవిష్యత్తు డైలమాలో పడింది. దీంతో వెనక్కి తగ్గని చిత్ర నిర్మాతలు వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అటు కోర్టు తీర్పు, ఇటు రాజకీయ విమర్శల నడుమ 'జన నాయకన్' విడుదలవుతుందా లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Next Story