మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ నేతల కుప్పిగంతులు

by Malleboina Mahesh |

మున్సిపల్ ఎన్నికల్లో నేతల కుప్పిగంతులు రాజకీయ పార్టీల్లో కలవరం రేపుతోంది. అప్పటివరకు పార్టీని పొగిడిన వాళ్ళు క్షణాల్లో కండువా మార్చేసి తిట్ల దండకం దండుకుంటున్నారు.

మున్సిపల్ ఎన్నికల్లో రాజకీయ నేతల కుప్పిగంతులు
X

దిశ, మెదక్ ప్రతినిధి : మున్సిపల్ ఎన్నికల్లో నేతల కుప్పిగంతులు రాజకీయ పార్టీల్లో కలవరం రేపుతోంది. అప్పటివరకు పార్టీని పొగిడిన వాళ్ళు క్షణాల్లో కండువా మార్చేసి తిట్ల దండకం దండుకుంటున్నారు. ప్రత్యర్థి పార్టీ ని తిట్టిన నేతలు పొగుడుతూ ఉండటం చూసిన జనాలు ఔరా ఇదేం రాజకీయం అంటూ నోరేళ్ల పెడుతున్నారు. మున్సిపల్ ఎన్నికలు అధికార ప్రతిపక్షాల మధ్య హోరాహోరీగా సాగుతుంది. రిజర్వేషన్లు ఖరారు నుంచి నేతల పార్టీల మార్పులు జోరందుకున్నాయి. జిల్లాలోని మెదక్ తో పాటు నర్సాపూర్, తూప్రాన్, రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని 75 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. రిజర్వేషన్ ప్రకటన తర్వాత ఆశావహులంతా టికెట్ ఆశిస్తూ పార్టీలపై ఒత్తిడి పెంచారు.

ప్రధానంగా అధికార కాంగ్రెస్ తో పాటు బీఆర్ఎస్ లో పార్టీ నేతలు అలిగి పక్క పార్టీలోకి చేరడం ఈ ఎన్నికల్లో పరిపాటిగా మారింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన సుప్రభాత్ రావు రామంపేట మున్సిపాలిటీ చైర్మన్ ఆశించి బంగపాటు గురయ్యాడు. దీంతో వెంటనే కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ లో చేరాడు. మెదక్ లో మాజీ మున్సిపల్ చైర్మన్ సావిత్రి తో ఆమె భర్త సురేందర్ గౌడ్ కూడా అధికార పార్టీని వీడి బీఆర్ ఎస్ పార్టీలో చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. మెదక్ లో బీఆర్ఎస్ పార్టీలో కీల కంగా వ్యవహరించిన చింతల నర్సింలు కాంగ్రెస్‌లో చేరి చైర్మన్ సీటు రేసులోకి రావడం గమనార్హం. బీఆర్ ఎస్ లో టికెట్ ఆశించిన సున్నం నరేష్, శ్రీకాంత్, శంకర్‌లు బీఆర్‌ఎస్ టికెట్ దక్కక పోవడంతో పార్టీని వీడి అధికార పార్టీలో చేరారు.

చర్చనీయంగా అంశంగా పార్టీలు మార్పు..!

మున్సిపల్ ఎన్నికల్లో నేతల పార్టీల మార్పు జనాల్లో చర్చనీయాంశంగా మారింది. ఏళ్లుగా పార్టీలో ఉంది క్షణాల్లో పార్టీలు మారడం ఏంటన్న ప్రశ్నలు ప్రజలు ఉత్పన్నం అవుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ రాలేదన్న కారణంతో పార్టీలు మారడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. గతంలో టికెట్ ఆశించి బంగపడ్డవారు పార్టీలో ఉన్న ఏదో విధంగా అవకాశాల కోసం ఎదురు చూశారు. కొంత మంది నేతలు తమ పేరు పక్కన పలనా పార్టీ నేత అంటూ ఇంటి పేరుగా మార్చుకున్న వారు కూడా పార్టీ మారడం పై సర్వత్రా చర్చ సాగుతోంది. గతంలో టికెట్ రాకున్నా పార్టీలో కొనసాగిన వారంతా ఇప్పుడు ఎందుకు పార్టీ మారుతున్నారు అనే ప్రశ్నలు కూడా జనాల్లో వస్తున్నాయి.

కేవలం పార్టీ టిక్కెట్ ఇవ్వలేదన్న కారణమా.. లేక వేరే ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనేది కూడా రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ప్రధాన పార్టీల్లో ఇలాంటి మార్పులు జరగడం మున్సిపల్ ఎన్నికల్లో సర్వ సాధారణంగా మారింది. ఇన్నాళ్లు పొగిడిన పార్టీపై అదే నేతలు దుమ్మెత్తి పోయడం బాధాకరంగా ఉందని నేతలే వాపోతున్నారు. కేవలం కౌన్సిలర్ సీటు కోసం ఇన్నాళ్లు నీడగా ఉన్న పార్టీ ని వీడడం సరికాదన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఆశించిన టికెట్ దక్కనప్పుడు ప్రత్యర్థిని ఓడించాలన్న కసితో కూడా కొంత మంది పార్టీని వెడుతున్న ఉదంతాలు కూడా ఉన్నాయి. పార్టీల మార్పు తో త్వరలో జరిగే ఎన్నికల్లో ఎవరికి నష్టం.. ఎవరికి లాభం కలుగుతుంది చూడాలి మరి...!

Next Story