- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వాళ్లకు డబుల్ హెల్మెట్ వద్దా...?
by Manoj |
దిశ, కుత్బుల్లాపూర్ : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు..latest telugu news

X
దిశ, కుత్బుల్లాపూర్ : రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోకుండా ఉండేందుకు ద్విచక్ర వాహనంపై వెనకాల కూర్చున్న వారు సైతం హెల్మెట్ ధరించాలని నిబంధనలు వచ్చాయి. ఇందుకు గాను ఇప్పటికే జరిమానాలు విధిస్తున్నారు కూడా. అయితే ఇవన్నీ సాధారణ ప్రజలకే అన్నట్లుగా అనిపిస్తోంది. ఈ నిబంధనలు పోలీసులకు కాదులే అన్నట్లుగా అనిపిస్తోంది ఈ ఫొటోను చూస్తుంటే. సోమవారం కొంపల్లి నుండి సుచిత్ర వైపు ఇద్దరు పోలీసులు ఒక ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. విశేషమేమిటంటే హెల్మెట్ పెట్టకుంటే జరిమానాలు విధించే వారే హెల్మెట్ పెట్టుకోలేదు. వెనకాల కూర్చున్న పోలీసులు పెట్టుకోవద్దనే నిబంధనలు ఏమైనా ఉన్నాయా...? అని పలువురు ప్రశ్నిస్తున్నారు.
Next Story






