- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద హైడ్రామా.. ఆర్మూర్ ఎమ్మెల్యేను అడ్డుకున్న పోలీసులు
గంటన్నర పాటు 44వ హైవేపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని హైడ్రామా నడుమ పోలీసులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ కి సోమవారం తరలించారు.

దిశ, భిక్కనూరు: గంటన్నర పాటు 44వ హైవేపై ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిని హైడ్రామా నడుమ పోలీసులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంప్ ఆఫీస్ కి సోమవారం తరలించారు. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నుంచి తన వాహనంలో ఆర్మూర్ వెళ్తున్న ఎమ్మెల్యేను భిక్కనూరు టోల్ ప్లాజా వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆర్మూర్ వెళ్లనీయకుండా పోలీసులు వాహనాన్ని నిలిపివేయడంతో, ఎందుకు వాహనాన్ని ఆపుతున్నారంటూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ప్రశ్నించారు. ఇప్పటికే ఆర్మూర్ లో పరిస్థితి బాగాలేదని, మీరు అక్కడికి వెళితే ఇంకా గొడవ పెద్దదయ్యే ప్రమాదం ఉన్నందున ఇక్కడే ఆపేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
దీంతో వాహనంలో నుంచి తాను కిందికి దిగలేనని భీష్మించుకొని కూర్చున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా స్వల్ప ఉద్రిక్తతకు దారి తీయడంతో సర్కిల్ పరిధిలోని పోలీసులను పెద్ద ఎత్తున టోల్ ప్లాజా వద్ద మోహరించారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి వాహనం నడిరోడ్డు పైన ఆపేసి దాంట్లోనే కూర్చున్నారు. అరెస్టు చేయకుండా స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించకుండా, హైడ్రామా నడుమ పోలీస్ ఎస్కార్ట్ తో భిక్కనూరు సీఐ జగడం నరేష్ ఆధ్వర్యంలోని పోలీసులు కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయానికి తరలించారు.






