- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రీన్ శారీలో ఎలిగెంట్ లుక్‌లో మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్
ట్రెడిషనల్ లుక్‌లో మెస్మరైజ్ చేసిన కీర్తి సురేష్

దిశ, వెబ్ డెస్క్: కీర్తి సురేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. తమిళ చిత్రాల ద్వారా కెరీర్‌ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోనూ అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం ఒకవైపు కోలీవుడ్, మరోవైపు టాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
అలాగే తమిళ హిట్ చిత్రం తేరికి అధికారిక రీమేక్‌గా రూపొందిన బేబీ జాన్ సినిమాతో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం కీర్తి సురేష్ తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న రౌడీ జనార్ధన్ చిత్రంలో నటిస్తోంది.
అలాగే విక్టరీ వెంకటేష్, కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న మల్టీస్టారర్ మూవీలోనూ హీరోయిన్‌గా కనిపించనుంది. కెరీర్ ప్రారంభంలో గ్లామర్‌కు దూరంగా ఉన్న కీర్తి సురేష్, గత కొంతకాలంగా స్టైలిష్ లుక్స్‌తో అభిమానులను ఆకట్టుకుంటోంది.
సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడూ తన అందమైన ఫొటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో ఆమె గ్రీన్ కలర్ చీరకు మ్యాచింగ్ బ్లౌజ్ ధరించి, క్యూట్ స్మైల్‌తో కెమెరాకు స్టిల్స్ ఇచ్చింది.
డ్రెస్‌కు తగ్గట్టుగా చిన్న బొట్టు, మెడలో నెక్లెస్, చేతికి గాజులు ధరించి, జుట్టును అందంగా ముడివేసుకుంది. మొత్తంగా క్లాసీ ట్రెడిషనల్ లుక్‌లో కీర్తి సురేష్ ఎంతో అందంగా కనిపించడంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.






