జి.వి. ప్రకాష్ సంగీతంలో సూర్య వాయిస్.. ఆసక్తి రేపుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' సాంగ్

by Pulgam srinivas |   (  Updated:2026-06-29 07:20:27  IST  )

'విశ్వనాథ్ అండ్ సన్స్' కోసం జి.వి. ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మాస్ డ్యాన్స్ నంబర్‌ను స్వయంగా సూర్య ఆలపించినట్లు సమాచారం.

జి.వి. ప్రకాష్ సంగీతంలో సూర్య వాయిస్.. ఆసక్తి రేపుతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ సాంగ్
X

దిశ, వెబ్ డెస్క్: టాలెంటెడ్ నటుడు సూర్య ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'విశ్వనాథ్ అండ్ సన్స్' చిత్రంలో ప్రధాన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ బ్యూటీ మమిత బైజు ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించనుండగా, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రాన్ని ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, ఈ సినిమా కోసం జి.వి. ప్రకాష్ కుమార్ ఓ అద్భుతమైన మాస్ బీట్‌తో కూడిన డ్యాన్స్ నంబర్‌ను కంపోజ్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఈ పాటను స్వయంగా హీరో సూర్య ఆలపించినట్లు సమాచారం. ఈ పాటలో సూర్య స్టైలిష్ డ్యాన్స్ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నట్లు తెలుస్తోంది. స్వయంగా తానే పాడిన పాటకు తానే డ్యాన్స్ చేయబోతున్నాడనే వార్తతో సూర్య అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. దీంతో ఈ పాటపై ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఇటీవల 'కరుప్పు' చిత్రంతో ప్రేక్షకులను అలరించి భారీ విజయాన్ని అందుకున్న సూర్య, ఇప్పుడు 'విశ్వనాథ్ అండ్ సన్స్'తో మరో విజయాన్ని అందుకుంటాడనే నమ్మకంతో అభిమానులు ఎదురుచూస్తున్నారు. దీంతో ఈ చిత్రంపై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి.

Next Story