హాస్టల్ బిల్డింగ్ పైనుంచి పడిపోయిన విద్యార్థిని.. అసలేం జరిగింది?

by Jakkula.Mamatha |

వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని జినుగుర్తి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల రెండో అంతస్తు నుంచి ఆదివారం అర్ధరాత్రి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి కింద పడడంతో నడుముతో పాటు రెండు కాళ్లు విరగడంతో విద్యార్థినికి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది.

హాస్టల్ బిల్డింగ్ పైనుంచి పడిపోయిన విద్యార్థిని.. అసలేం జరిగింది?
X

దిశ, తాండూర్ రూరల్: వికారాబాద్ జిల్లా తాండూరు మండల పరిధిలోని జినుగుర్తి తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల రెండో అంతస్తు నుంచి ఆదివారం అర్ధరాత్రి ఇంటర్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని మహేశ్వరి కింద పడడంతో నడుముతో పాటు రెండు కాళ్లు విరగడంతో విద్యార్థినికి ప్రాణాపాయ స్థితి ఏర్పడింది. తక్షణ వైద్యం కోసం తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం డాక్టర్ల సూచన మేరకు తాండూరు నుండి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. కావాలని కింద దూకిందా... లేదా ఎవరైనా తోసేసారా? అనే దానిపై సందిగ్ధత నెలకొంది. ఘటనపై విచారణ ప్రారంభించారు. ప్రిన్సిపాల్, సెక్యూరిటీ వైఫల్యం అంటూ తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల పై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనతో ప్రభుత్వ హాస్టల్ లో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రుల్లో విపరీతమైన ఆందోళన నెలకొంది.

Next Story