- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తమిళనాడులో కొనసాగుతున్న రాజీనామాల పర్వం.. మరో ఎమ్మెల్యే రాజీనామా
తమిళనాడులో ఎఐఎడిఎంకేకు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి, కరూర్ ఎమ్మెల్యే ఎం.ఆర్. విజయభాస్కర్ తన పదవికి రాజీనామా చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తమిళనాడు రాజకీయాల్లో ఎమ్మెల్యేల రాజీనామా పర్వం కంటిన్యూ అవుతోంది. రాష్ట్రంలో టీవీకే నేతృత్వంలో విజయ్ ప్రభుత్వం ఏర్పాటు అయిన నాటి నుంచి ఇప్పటి వరకు ఐదుగురు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేయగా తాజాగా అదే బాటలో మరో ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేశారు. AIADMK పార్టీకి చెందిన కరూర్ ఎమ్మెల్యే, మాజీ రవాణా శాఖ మంత్రి ఎం.ఆర్. విజయ భాస్కర్ ఇవాళ రాజీనామా చేశారు. ఈ ఉదయం రాష్ట్ర సచివాలయంలో స్పీకర్ జె.సి.డి. ప్రభాకర్‌ను కలిసిన విజయభాస్కర్.. తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు.
పళనిస్వామికి ఇబ్బందులు:
తాజా పరిణామాల నేపథ్యంలో ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామికి ఇబ్బందులుతప్పడం లేదు. రెండు నెలల క్రితం జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎఐఎడిఎంకే నుంచి ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు వైదొలుగుతుండటం సంచలనంగా మారింది. తొలుత విజయ్ ప్రభుత్వంపై విశ్వాస తీర్మానంలో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేల్లో ఏకంగా 25 మంది టీవీకేకు సపోర్టు చేయగా అందులోని వారు క్రమంగా తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసిన వారంతా అధికార టీవీకేలో చేరగా విజయ భాస్కర్ కూడా అదే బాటలో పయనిస్తారని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది.






