'అద్దెకు బాయ్‌ఫ్రెండ్' అంటూ సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు.. రంగంలోకి దిగిన పోలీసులు!

by Jakkula.Mamatha |

అద్దెకు బాయ్ ఫ్రెండ్.. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికల మీద అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తూ గలీజును ప్రచారం చేస్తున్న ఐడీల పై మల్కాజ్గిరి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు ఫోకస్ పెట్టారు.

అద్దెకు బాయ్‌ఫ్రెండ్ అంటూ సోషల్ మీడియాలో అశ్లీల వీడియోలు.. రంగంలోకి దిగిన పోలీసులు!
X

దిశ,సిటీ క్రైమ్: ‘అద్దెకు బాయ్ ఫ్రెండ్’.. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా వేదికలలో అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తూ గలీజును ప్రచారం చేస్తున్న @ishabhallaa, vinayak gupta, ఐడీల పై మల్కాజ్గిరి యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ అధికారులు ఫోకస్ పెట్టారు. రెంట్ ఏ బాయ్ ఫ్రెండ్ వీడియోలతో ఆన్ లైన్‌లో మనుషుల అక్రమ రవాణాకు ప్రోత్సహిస్తున్నారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోల ద్వారా యువకులు, యువతులను ఆకర్షించి వారిపై లైంగిక దాడులకు పాల్పడే ప్రమాదం ఉందని పోలీసులు గుర్తించారు. ఈ గలీజ్ మాయలో పడేసి వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిలింగ్‌కు పాల్పడే అవకాశం ఉందని భావించిన మల్కాజిగిరి కమిషనరేట్ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇలాంటి పోస్టుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

Next Story