- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హత్య కేసును ఛేదించిన పోలీసులు
నిజామాబాద్ శివారులోని న్యాల్కల్ గ్రామంలో చోటు చేసుకున్న యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు.

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ శివారులోని న్యాల్కల్ గ్రామంలో చోటు చేసుకున్న యువకుడి హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడనే కారణంతో భార్య తన సహచరులతో కలిసి పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. పోలీసుల వివరాల ప్రకారం గల్ఫ్ నుంచి ఇటీవల స్వగ్రామానికి వచ్చిన ప్రశాంత్‌ను, న్యాల్కల్‌కు చెందిన వెంకట సాయి అలియాస్ బంటి మద్యం సేవించేందుకు తీసుకెళ్లాడు.
అనంతరం భార్య సంధ్య, బంటి కలిసి అతడిని అపస్మారక స్థితికి చేర్చినట్లు విచారణలో వెల్లడైంది. ఆ తర్వాత ప్రశాంత్‌ను ఆసుపత్రికి తరలించినట్లు నమ్మించి, ప్రైవేటు ఆసుపత్రిలో టాయిలెట్ క్లీనర్ ఆర్పిక్ లిక్విడ్‌ను అతడి శరీరంలోకి ఎక్కించి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సంధ్యకు అనిల్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉండగా, అదే హత్యకు ప్రధాన కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ కేసులో నిందితులు సంధ్య, అనిల్, వెంకట సాయి అలియాస్ బంటి పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం ముగ్గురినీ కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు.






