- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని విచారించిన పోలీసులు
మంత్రి టీజీ భరత్‌పై చేసిన ఆరోపణల కేసులో వైస్సార్సీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిని కర్నూలు త్రీటౌన్ పోలీసులు 41ఏ నోటీసు ఇచ్చి విచారించారు.

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) యువ నాయకుడు, శాప్ (SAP) మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి (Byreddy Siddharth Reddy)ని కర్నూలు త్రీటౌన్ పోలీసులు బుధవారం సుదీర్ఘంగా విచారించారు. ఈ పరిణామంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌పై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి గతంలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు, ఆరోపణల నేపథ్యంలో ఆయనపై పరువు నష్టం, అలాగే క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగానే పోలీసులు ఆయనకు సీఆర్పీసీ 41 ఏ (41A) కింద నోటీసులు జారీ చేసి, పోలీస్ స్టేషన్‌కు పిలిపించి విచారణ జరిపారు.
పోలీసుల విచారణ అనంతరం బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి టీజీ భరత్‌పై తాను చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నిటికీ తాను సమాధానం ఇచ్చానని.. మంత్రిపై తాను చేసిన ఆరోపణలను నిరూపించడానికి తన వద్ద పక్కా ఆధారాలు ఉన్నాయని తెలిపారు. న్యాయస్థానం ముందు గానీ, అవసరమైన సరైన సమయంలో గానీ ఆధారాలన్నింటినీ బయటపెట్టి, తన ఆరోపణలను వంద శాతం నిరూపిస్తానని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సవాల్ విచారించారు. ఈ హై ప్రొఫైల్ రాజకీయ కేసుతో కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.






