- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాదీ ముబారక్ స్కీమ్‍లో భారీ మోసం.. ఆర్ఐ సహా పలువురు అరెస్ట్
హైదరాబాద్‌లో షాదీ ముబారక్ పథకంలో రూ.30 లక్షల భారీ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ పత్రాలతో దోపిడీకి పాల్పడిన ఆర్‌ఐ, మరో ఐదుగురి అరెస్ట్.

దిశ, డైనమిక్ బ్యూరో: మైనారిటీ కుటుంబాలకు చెందిన నూతన వధువులకు ఆర్థిక సహాయం అందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న షాదీ ముబారక్ స్కీమ్ లో భారీ అక్రమాలు వెలుగు చూశాయి. తప్పుడు దరఖాస్తులతో అక్రమ మార్గాన ప్రభుత్వం ఉద్యోగులు తెరలేపిన బాగోతం హైదరాబాద్‍లో తాజాగా బట్టబయలైంది. బడంగ్ పేట రెవెన్యూ ఇన్ స్పెక్టర్ అశోక్ కిరణ్ సహా మరో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఎండీ ఇంత్తేమాద్, ఎండీ అక్బర్, సయ్యద్ ముషారఫ్, సర్పరాజ్, జప్పార్ ను అరెస్ట్ చేశారు. షాదీ ముబారక్ స్కీమ్ లో రూ. 30 లక్షల మేర కాజేసినట్లు వీరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇందుకోసం వీరు నకిలీడాక్యుమెంట్లు, ఆధార్ కార్డుల సృష్టించి తప్పుడు దరఖాస్తులు చేసి డబ్బులు కాజేసినట్లు అధికారులు గుర్తించారు. ఆర్ఐ అశోక్ కిరణ్ కమిషన్ తీసుకుని తప్పుడు దరఖాస్తులను ప్రాసెస్ చేశారు. ఈ మేరకు షాదీ ముబారక్‍లో అక్రమాలను గుర్తిం నిందితులను పట్టుకున్న టాస్క్ ఫోర్స్ అధికారులు వారిని అత్తాపూర్ పోలీసులకు అప్పగింంచారు.






