- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ సమయంలో బట్టల సువాసన.. మీ ఆరోగ్యాన్ని దెబ్బతీయవచ్చు!
వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతకడానికి ఉపయోగించే ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్ల వాసన ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : వాషింగ్ మెషిన్ ఉపయోగించిన తర్వాత, డ్రైయర్‌లో నుంచి బట్టలు తీస్తున్నప్పుడు లేదా ఆరబెడుతున్నప్పుడు సహజంగానే ఒక విధమైన వాసన వస్తుంది. చాలామంది అనుకోకుండానే ఈ “ఫ్రెష్ లాండ్రీ” వాసనను ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ ఇది ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే విషపూరిత రసాయనాలతో నిండి ఉంటుంది. ఇంటిలోపలి గాలి కాలుష్యానికి కూడా కారణం అవుతుంది.
ఊపిరితిత్తులపై ప్రభావం
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. వాషింగ్ మెషిన్‌లో బట్టలు ఉతకడానికి ఉపయోగించే ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్ల లిక్విడ్ల వాసన ఆహ్లాకరంగానే అనిపిస్తుంది. కానీ వాస్తవానికి అది వాలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్ (VOCs) మిశ్రమం. పైగా ఇందులో ఆసిటాల్డిహైడ్, బెంజీన్ వంటి హానికారక రసాయనాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులను ప్రభావితం చేసి, చర్మ సమస్యలు కలిగించడమే కాకుండా, దీర్ఘకాలంలో క్యాన్సర్ వంటి తీవ్రమైన రిస్కులను కూడా పెంచుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇంకా ఏం జరుగుతుంది?
తరచుగా ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్లు లేదా ఫ్రెష్ లాండ్రీ వాసనను వాసన పీల్చడంవల్ల దగ్గు, తలతిరగడం, తలనొప్పి వంటి ఇబ్బందులు తలెత్తే చాన్స్ ఉంటుంది. కాబట్టి ప్రత్యామ్నాయ మార్గాలను ప్రయత్నించడం మంచిదని నిపుణులు సూచిస్తు్న్నారు. ఫాబ్రిక్ సాఫ్ట్‌నర్లకు బదులుగా తెల్ల వెనిగర్, బేకింగ్ సోడా, ఉన్ని డ్రైయర్ బాల్స్, ఇంట్లోనే తయారు చేసుకునే డ్రైయర్ షీట్లు వంటివి ఉపయోగించడం సురక్షితమని చెబుతున్నారు. దీనివల్ల హానికర రసాయనాలనే కాకుండా పరోక్షంగా ప్యాకేజింగ్ వ్యర్థాలు, నీటి కాలుష్యం వంటి వాటిని కూడా తగ్గించిన వారవుతారు.






