మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్.. కీలక సమాచారం రాబట్టిన పోలీసులు

by Disha Web |
మావోయిస్టు సానుభూతిపరులు అరెస్ట్.. కీలక సమాచారం రాబట్టిన పోలీసులు
X

దిశ, దుమ్ముగూడెం : మండల పరిధిలోని పెద్ద బండిరేవు క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా మావోయిస్టు సానుభూతిపరులు పట్టుబడ్డారు. వివరాల్లోకి వెళితే.. దుమ్ముగూడెం ఎస్ఐ రవికుమార్ తన స్టేషన్ సిబ్బంది, 141 బెటాలియన్ జి కంపెనీ సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి ప్రధాన రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా.. భద్రాచలం నుంచి చర్ల వైపు వెళ్తున్న TS28 T 42 10 నెంబర్ గల కారు, రెండు ద్విచక్ర వాహనాలను పోలీసులు ఆపగా ఆ వాహనదారులు పారిపోవడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వెంట పడి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా.. చాలాకాలం నుంచి నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి సహకరిస్తూ, మావోయిస్టులకు అవసరమైన డబ్బులు, వివిధ రకాల సరుకులను చేరవేస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారని పోలీసులు తెలిపారు.

అంతేకాదు మావోయిస్టు పార్టీ వారి ఆదేశాల మేరకు కాంట్రాక్టర్ అయిన ప్రభాకర్ రావు, కొమురం రామ్మూర్తి వద్ద నుంచి నగదు సేకరించి విప్లవ సాహిత్య పుస్తకాలు, నగదు అప్పగించడానికి కొండవాయి గ్రామానికి వెళ్తున్నట్టు నిందితులు సమాచారం ఇచ్చారు. దీంతో వారిని కూడా అదుపులోకి తీసుకుని విచారించగా వారు కూడా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అరెస్టు అయిన వారి వివరాలు.. వరుస రాజు బోధనెల్లి గ్రామం, చర్ల మండలం, కొమరం నాగేశ్వరరావు తిమ్మాపురం గ్రామం, మంగపేట మండలం, గేదల శ్రీనివాసరావు హైదరాబాద్, ఒకరు బాలనేరస్తుడు గా పోలీసులు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి రూ.3,34,001 నగదు, కారు, రెండు ద్విచక్ర వాహనాలు, నాలుగు సెల్ ఫోన్లు, నిషేధిత విప్లవ సాహిత్య పుస్తకాలను స్వాధీనం చేసుకొని, ఆ నిందితులను కోర్టుకు తరలించినట్లు పేర్కొన్నారు.


Next Story

Most Viewed