రూట్ మార్చిన గంజాయి గ్యాంగ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

by Disha Web Desk 19 |
రూట్ మార్చిన గంజాయి గ్యాంగ్.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలుగు రాష్ట్రాల పోలీసులు గంజాయి రవాణా చేసే వారి పట్ల ఉక్కపాదం మోపుతున్నారు. రోజురోజుకు పోలీసుల నిఘా ఎక్కువ అవడంతో గంజాయి దొంగలు రూటు మార్చారు. గంజాయిని ఆయిల్ రూపంలో మార్చి రవాణా చేస్తోన్న నలుగురిని అరెస్టు చేసినట్లు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ వెల్లడించారు. నిందితుల నుంచి 52 కిలోల గంజాయి, ఒక లీటర్ హాష్ ఆయిల్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ తెలిపారు.

ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ మీడియాకు వెల్లడిస్తూ.. వీరంతా ఉత్తర్ ప్రదేశ్, దిల్లీకి చెందిన ముఠా అని పేర్కొన్నారు. విశాఖ ప్రాంతంలో హాష్ ఆయిల్ తయారు చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. మార్కెట్‌లో లీటర్ హాష్ ఆయిల్ ధర రూ.3లక్షలు ఉందని అన్నారు. కేజీ గంజాయికి రూ,10 వేల నుండి 15 వేలకు పెరిగిందని చెప్పారు. నిందితులు ఎవరికీ అనుమానం రాకుండా ట్రావెల్ బ్యాగ్‌లో గంజాయిని ప్యాక్ చేసి విశాఖలోని దువ్వాడ రైల్వే స్టేషనులో రైలు ఎక్కారు. మౌలాలి స్టేషన్‌లో దిగగానే పోలీసులు అనుమానంతో ట్రావెల్ బ్యాగ్ చెక్ చేయడంతో అసలు సంగతి బయటపడిందని సీపీ మహేశ్ భగవత్ వివరించారు.


Next Story