తాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు : అడిషనల్ కలెక్టర్

by Disha Web Desk 11 |
తాగునీటికి ఇబ్బంది కలగకుండా చర్యలు : అడిషనల్ కలెక్టర్
X

దిశ, హుజూర్ నగర్ : ఎండల తీవ్రత అధికంగా ఉండటం వలన మే నెలలో ప్రజలకు తాగునీటి సమస్య ఎదుర్కోకుండా పంచాయతీ కార్యదర్శులు ఇప్పటి నుండే అప్రమత్తంగా ఉండాలని సూర్యాపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రియాంక ఆదేశించారు. సోమవారం హుజూర్ నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో తాగునీటిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాగునీటి సమస్య పరిష్కరించేందుకు డిఎంఎఫ్ఏ నిధులను మంజూరు చేశామన్నారు.

తాగునీటి సమస్యను గుర్తించి అత్యవసరమైతే అద్దె బోర్లను తీసుకొని తాగునీటిని సప్లై చేయాలని అధికారులకు సూచించారు. మఠంపల్లి మండలంలోని మట్టపల్లి డబ్ల్యుటిపి నుండి 75 హాబిటేషన్లకు చింతలపాలెం మండలం కిష్టాపురం నుంచి 15 హాబిటేషన్లకు మొత్తం 90 హాబిటేషన్లకు తాగునీటిని అందిస్తున్నామన్నారు. అలాగే ప్రజలు తాగునీటి కోసం ఎలాంటి సమస్య లేకుండా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సురేష్, డిపిఓ సురేష్ కుమార్, మిషన్ భగీరథ ఎస్సీ వెంకటేశ్వర్లు, ఈఈ శ్రీనివాస్, గ్రిడ్డు అభినవ్ ఇంట్రా, డిఈ వెంకటరెడ్డి, మిషన్ భగీరథ, ఏఈలు, ఎంపీడీవోలు, ఎంపీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed